వజ్రకరూర్‌ మండలంలో వజ్రాలవేట

| Edited By:

Jun 04, 2019 | 3:35 PM

ప్రతి సంవత్సరం జూన్‌ ప్రారంభంలో అనంతపురం జిల్లా వజ్రకరూర్‌ మండలంలోని గ్రామాలకు ప్రజలు భారీగా తరలివస్తుంటారు. జూన్‌లో వర్షాలు పడిన వెంటనే ఇక్కడి పొలాల్లో వజ్రాలు దొరుకుతాయనే నమ్మకమే దీనికి కారణం. ఎప్పటిలాగానే ఈ సారి కూడా ప్రజలు వజ్రకరూర్‌కు తరలివస్తున్నారు. పొలాల్లో అణువణువు అన్వేషిస్తున్నారు. ఎక్కడైనా వజ్రం దొరక్కపోతుందా.. అదృష్టం పండకపోతుందా అనుకుంటూ వజ్రాల వేటలో నిమగ్నమయ్యారు. కొందరు ఉద్యోగానికి సెలవు పెట్టి మరీ రాగా.. మరికొందరు స్నేహితులను వెంట తెచ్చుకుని పొలాల్లో వెతుకుతున్నారు. భోజనాలు […]

వజ్రకరూర్‌ మండలంలో వజ్రాలవేట
Follow us on

ప్రతి సంవత్సరం జూన్‌ ప్రారంభంలో అనంతపురం జిల్లా వజ్రకరూర్‌ మండలంలోని గ్రామాలకు ప్రజలు భారీగా తరలివస్తుంటారు. జూన్‌లో వర్షాలు పడిన వెంటనే ఇక్కడి పొలాల్లో వజ్రాలు దొరుకుతాయనే నమ్మకమే దీనికి కారణం. ఎప్పటిలాగానే ఈ సారి కూడా ప్రజలు వజ్రకరూర్‌కు తరలివస్తున్నారు. పొలాల్లో అణువణువు అన్వేషిస్తున్నారు. ఎక్కడైనా వజ్రం దొరక్కపోతుందా.. అదృష్టం పండకపోతుందా అనుకుంటూ వజ్రాల వేటలో నిమగ్నమయ్యారు. కొందరు ఉద్యోగానికి సెలవు పెట్టి మరీ రాగా.. మరికొందరు స్నేహితులను వెంట తెచ్చుకుని పొలాల్లో వెతుకుతున్నారు. భోజనాలు సైతం చెట్ల కిందే ఆరగిస్తున్నారు. వజ్రాల కోసం రాయలసీమ నుంచే కాకుండా గుంటూరు, ప్రకాశం జిల్లాల నుండి కూడా జనం వస్తుంటారని ఇక్కడి రైతులు చెబుతున్నారు.