Sankranti Holidays: విద్యార్థులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సెలవులు ఇవే.. అప్పటి నుంచే పునఃప్రారంభం..

|

Dec 27, 2022 | 10:24 AM

ఆంధ్రప్రదేశ్ లో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో సంక్రాంత్రి.. అగ్రస్థానంలో ఉంటుంది. ఈ పండుగకు స్కూళ్లకు సెలవులు ఇస్తుంటారు. ఈ ఏడాది కూడా సంక్రాంతి కోసం పాఠశాలలకు సెలవులను ప్రకటించింది...

Sankranti Holidays: విద్యార్థులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సెలవులు ఇవే.. అప్పటి నుంచే పునఃప్రారంభం..
Sankranti Holidays
Follow us on

ఆంధ్రప్రదేశ్ లో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో సంక్రాంతి.. అగ్రస్థానంలో ఉంటుంది. ఈ పండుగకు స్కూళ్లకు సెలవులు ఇస్తుంటారు. ఈ ఏడాది కూడా సంక్రాంతి కోసం పాఠశాలలకు సెలవులను ప్రకటించింది ప్రభుత్వం. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు జనవరి 11 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. జనవరి 17న తిరిగి తెరుచుకుంటాయి. ఈ విద్యా సంవత్సరం మొత్తంలో 220 రోజులు పాఠశాలలు పనిచేయనుండగా.. 80 రోజులు సెలవులు ఉంటాయి. జూనియర్ కళాశాలలకు జనవరి 11 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. అయితే ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇక తెలంగాణలో 5 రోజులు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జనవరి 13 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఉన్నాయి. ఇంటర్ కాలేజీలకు ఇవే సెలవులు దినాలు ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే భోగి పండుగా జనవరి 14న వచ్చింది. ఆ రోజు రెండో శనివారం కావడం, 15న సంక్రాంతి పర్వదినాన ఆదివారం కావడంతో రెండు రోజుల సెలవులు మిస్ అవుతున్నారు. జనవరి 16న సోమవారం కనుమ పండుగకు ప్రభుత్వం ఆప్షనల్ హాలిడేను ప్రకటించింది.

మరోవైపు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2023 మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఏపీలో ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 3 వరకు ఫస్టియర్, మార్చి 16 నుంచి ఏప్రిల్ 4 వరకు సెకండ్ పరీక్షలు ఉంటాయి. 2023 మార్చి 15 వ తేదీ నుంచి ఏప్రిల్‌ 4వ తేదీ వరకు తెలంగాణలో ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 15న ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్, మార్చి 16న సెకండియర్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.