కిష‌న్ రెడ్డి నివాసంలో సంక్రాంతి సంబరాలు.. స్పెషల్ అట్రాక్షన్‌గా పశ్చిమగోదావరి ఎద్దుల బండి..

ఇటీవల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంక్రాంతి వేడుకలను ఢిల్లీలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి తో సహా తెలుగు రాష్ట్రాల ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ సైతం హాజరయ్యారు.. ఈ వేడుకల్లో పాలూరులో శంకర్ తయారు చేసిన ఎద్దుల బొమ్మలను ప్రదర్శనలో ఉంచారు. ఇవే అక్కడ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

కిష‌న్ రెడ్డి నివాసంలో సంక్రాంతి సంబరాలు.. స్పెషల్ అట్రాక్షన్‌గా పశ్చిమగోదావరి ఎద్దుల బండి..
West Godavari Bullock Cart

Edited By: Jyothi Gadda

Updated on: Jan 30, 2025 | 7:44 PM

పశ్చిమగోదావరి జిల్లా పేరు చెబితే పందెం కోళ్లు గుర్తుకు వస్తాయి. కానీ, ఇప్పుడు ఓ యువకుడు న్యూ ట్రెండ్ కి శ్రీకారం చుట్టాడు. పల్లెల్లో సైతం కనుమరుగవుతున్న ఎద్దులకు జీవం పోస్తున్నాడు. అద్భుతమైన ఎద్దుల బొమ్మలను తయారు చేసి ఔరా అని పిస్తున్నాడు. పశ్చిమగోదావరి జిల్లా పొలూరుకు చెందిన శంకర్ చిన్నతనం నుంచి బొమ్మలు గీయటమంటే ఇష్టం.. బ్రతుకు తెరువు కోసం గల్ఫ్ దేశాలకు సైతం వెళ్లాడు. కానీ అక్కడ చేసే పని కంటే తనకు వచ్చిన కళనే నమ్ముకోవాలని బొమ్మల తయారీ ప్రారంభించాడు. మనుషుల విగ్రహాలతో పాటు ఎద్దుల బొమ్మలను తయారు చేస్తున్నాడు.

ఢిల్లీ సంక్రాంతి వేడుకల్లో…

ఇవి కూడా చదవండి

ఇటీవల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంక్రాంతి వేడుకలను ఢిల్లీలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి తో సహా తెలుగు రాష్ట్రాల ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ సైతం హాజరయ్యారు.. ఈ వేడుకల్లో పాలూరులో శంకర్ తయారు చేసిన ఎద్దుల బొమ్మలను ప్రదర్శనలో ఉంచారు. ఇవే అక్కడ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

షోకేజ్ లో బొమ్మలుగా మాత్రమే కాదు..

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఓ ట్రెండ్ నడుస్తోంది. రాజకీయ నేతలు, అధికారులు ఎవరు వచ్చినా ఎద్దుల బండ్లు బహుమతిగా ఇస్తున్నారు. పెద్ద సైజులో ఉండే వాటిని టీ పాయ్ లు గా ఉపయోగిస్తున్నారు. బాగా చిన్న వాటిని షోకేజ్ లో ఉంచుతున్నారు.

కార్పెంటర్‌లకు ఉపాధి..

ప్రస్తుతం భవన నిర్మాణంలో వినూత్న మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తలుపులు, కిటీకీ లు కర్రతో కాకుండా పివిసి, యు పిసిసి, ఐరన్ మెటీరియల్ తో తయారవుతున్నాయి. దీంతో వీరికి ఉపాధి కరువైంది. ఈ నేపథ్యంలోనే చాలా మంది కార్పెంటర్లు ఎద్దుల బండ్లు తయారు చేయటాన్ని వృత్తిగా మార్చుకున్నారు. ఇలాంటి వారంతా ఎద్దుల బొమ్మలను పాలూరు నుంచే తీసుకుని వెళ్తున్నారు. ఒకపుడు పని కోసం ఇతర దేశానికి వలస పోయిన శంకర్ తన సోదరుడు కృష్ణ తో కలిసి ఇప్పుడు ఒక పెద్ద బొమ్మల తయారీ కేంద్రం నడుపుతున్నాడు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వందల మందికి పని కల్పిస్తున్నారు.

ఇక్కడ తయారైన బొమ్మలు లేపాక్షి, విరూపాక్షి వంటి షోరూంలో సైతం అందుబాటులో ఉంటున్నాయి. ఇలా ఒక మారుమూల కుగ్రామం లో తయారైన ఎద్దుల బొమ్మలు మెట్రో నగరాలు, ఫాం హౌస్ ల్లో అలంకరణ వస్తువులుగా మారాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..