Sajjala Ramakrishna Reddy: కేసీఆర్‌ నుంచి ఆ ప్రతిపాదన వస్తే జగన్ ఆలోచిస్తారు.. సజ్జల కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్‌సీపీ కర్ణాటక, సహా పలు రాష్ట్రాల్లో పోటీపై స్పందించారు.

Sajjala Ramakrishna Reddy: కేసీఆర్‌ నుంచి ఆ ప్రతిపాదన వస్తే జగన్ ఆలోచిస్తారు.. సజ్జల కీలక వ్యాఖ్యలు
Sajjala Ramakrishna Reddy

Updated on: Dec 12, 2022 | 2:09 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్‌సీపీ కర్ణాటక, సహా పలు రాష్ట్రాల్లో పోటీపై స్పందించారు. కర్ణాటకలో పోటీ చేసే ఆలోచన లేదంటూ పేర్కొన్నారు. అలా అనుకుంటే తమిళనాడులో ఇంకా పలు రాష్ట్రాల్లో కూడా పోటీ చేయవచ్చు అంటూ పేర్కొన్నారు. తెలంగాణ వద్దనుకుని ఏపీపై పూర్తి దృష్టి పెట్టామంటూ సజ్జల పేర్కొన్నారు. వైసీపీ ఏపీ ప్రజలకు అంకితమైన పార్టీ అంటూ పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధి, సంక్షేమం తప్ప వేరే ఆలోచన లేదంటూ పేర్కొన్నారు. ఎవరొకరి చంక ఎక్కి గెలవాలి అనుకునే ఆలోచన లేదంటూ స్పష్టంచేశారు. ముందు ఏపీ ప్రయోజనాలు పూర్తి చేసిన తర్వాత వేరే ఆలోచన చేస్తామంటూ తెలిపారు.

సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ గురించి కూడా సజ్జల రామకృష్ణా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీఆర్ఎస్ పెడితే మంచిదేనని.. ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చంటూ సజ్జల పేర్కొన్నారు. మద్దతు కావాలని బీఆర్‌ఎస్‌ నుంచి ప్రతిపాదన వస్తే అప్పుడు సీఎం జగన్‌ ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అయినా తమకు ఏపీ ప్రయోజనాలే ముఖ్యమని.. తాము ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమంటూ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..