Guntakal: రైల్వేస్టేషన్‌‌లో భయం.. భయంగా.! డౌట్ వచ్చి.. ఓ మహిళ బ్యాగ్ చెక్ చేయగా..

|

Apr 29, 2024 | 10:51 AM

ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న తరుణంలో ఏపీ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. రాష్ట్రమంతటా ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు పెట్టి.. అక్రమంగా రవాణా అవుతోన్న నగదు, మద్యం పంపిణీని అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే జరుపుతున్న సోదాల్లో పలు చోట్ల..

Guntakal: రైల్వేస్టేషన్‌‌లో భయం.. భయంగా.! డౌట్ వచ్చి.. ఓ మహిళ బ్యాగ్ చెక్ చేయగా..
Guntakal Railway Station
Follow us on

ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న తరుణంలో ఏపీ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. రాష్ట్రమంతటా ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు పెట్టి.. అక్రమంగా రవాణా అవుతోన్న నగదు, మద్యం పంపిణీని అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే జరుపుతున్న సోదాల్లో పలు చోట్ల భారీగా నగదు, బంగారం, మద్యం పట్టుబడిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా అనంతపురం జిల్లా గుంతకల్ రైల్వే‌స్టేషన్‌లో తనిఖీలు చేపట్టిన పోలీసులకు భారీగా మొత్తంలో డబ్బు పట్టుబడింది. గుంతకల్ రైల్వే‌స్టేషన్ నుంచి రైలెక్కేందుకు సిద్దమైన ఓ మహిళ కదలికలు అనుమానాస్పదంగా కనిపించడంతో.. పోలీసులు ఆమెను ఆపి.. బ్యాగ్ చెక్ చేశారు. ఇక అందులో రూ. 50 లక్షల నగదు ఉన్నట్టు గుర్తించారు. ఈ డబ్బుకు సంబంధించి ఎలాంటి సరైన డాక్యుమెంట్స్ లేకపోవడంతో.. పోలీసులు దాన్ని సీజ్ చేశారు. కాగా, ప్రస్తుతం రాష్ట్రమంతా ఎన్నికల కోడ్ అమలవుతున్న నేపధ్యంలో రూ. 50 వేలకు మించి నగదు వెంట తీసుకెళ్లవద్దని అధికారులు గతంలోనే ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో అంతకన్నా ఎక్కువ అమౌంట్ తీసుకెళ్లినా.. సరైన డాక్యుమెంట్స్ వెంట ఉంచుకోవాలని సూచించారు.