Robbery : సింగిల్‌గా వచ్చాడు.. సింపుల్‌గా దోచుకెళ్లాడు.. సీసీ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు..

|

Jun 25, 2021 | 8:35 AM

Robbery : ముఖానికి కర్చీఫ్, తలపై టోపీ, జీన్స్, షూ.. ఇలా దర్జాగా వచ్చాడు. బంగారం, వెండి మూటగట్టుకుని పోయాడు. ఇదీ.. గోపాలపట్నం..

Robbery : సింగిల్‌గా వచ్చాడు.. సింపుల్‌గా దోచుకెళ్లాడు.. సీసీ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు..
Robbery
Follow us on

Robbery : ముఖానికి కర్చీఫ్, తలపై టోపీ, జీన్స్, షూ.. ఇలా దర్జాగా వచ్చాడు. బంగారం, వెండి మూటగట్టుకుని పోయాడు. ఇదీ.. గోపాలపట్నం శ్రీజ్యూయలర్స్ చోరీ చేసేందుకు వచ్చిన దొంగ స్టైల్. తాజాగా ఈ కేసుకు సంబంధించి పోలీసులు కీలక ఆధారాలను సేకరించారు. జ్యూయలరీ షాపు వద్ద ఉన్న సీసీ కెమెరాలో చోరీకి సంబంధించి దృశ్యాలన్నీ రికార్డ్ అయ్యాయి. ఈ దృశ్యాల ప్రకారం.. సింగిల్ గానే వచ్చిన దొంగ.. అర్ధరాత్రి ఒంటిగంట నుంచి తన ఆపరేషన్ మొదలుపెట్టాడు. దాదాపు గంటపాటు పరిసర ప్రాంతాల్లోనే ఉంటూ జ్యూయలరీ షాపులోకి చొరబడ్డాడు. ఆపై ఇటూ చూసి నేరుగా బంగారం ఆభరణాలపై దృష్టి మరల్చాడు. మొత్తం 24 తులాల బంగారం, 12 కిలోల వెండి అపహరించాడు.

అయితే, చోరీ చేశాక ఆ దొంగ జ్యూయలరీ షాప్ లోని డీవీఆర్ కేబుల్స్ కత్తిరించాడు. ఏమనుకున్నాడో ఏమో గానీ దాన్ని మాత్రం తీసుకెళ్ళలేదు. బహుశా సింగిల్ గా వచ్చాడు కదా.. తనను పట్టుకోలేరనే ధీమా కాబోలు. మొత్తానికి దర్జాగా షాపులోకి చొరబడి అందినకాడికి దోచుకుని.. దొంగిలించిన సొత్తును హ్యాపీగా మూటగట్టుకుని పరారయ్యాడు.

ఇదిలాఉంటే, ఈ ఉదయం జ్యూయలరీ షాపు యజమాని తన షాపులో చోరీ జరిగిందని గ్రహించి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు షాపు వద్దకు చేరుకుని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. షాపులో, షాపు సరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. దొంగ కదలికలన్నీ ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అయితే, ఆ దొంగ తనను ఎవరూ గుర్తుపట్టకుండా పూర్తిగా మాస్క్ ధరించాడు. దాంతో అతన్ని గుర్తించడం కష్టంగా మారింది. కాగా, జ్యూయలరీ షాపులో చోరీకి పాల్పడింది అంతర్రాష్ట్ర దొంగగా పోలీసుల అనుమానిస్తున్నారు. ఈ చోరీపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రత్యేక బృందాలతో దొంగకోసం గాలిస్తున్నారు.

Also read:

Neem Leaves: కిడ్నీలో రాళ్లను కరిగించే వేప ఆకుల రసం.. డయాబెటిక్ రోగులు వేప ఆకులను తింటే ఎన్ని లాభాలున్నాయంటే..

SBI Business Loan: గుడ్‌న్యూస్‌.. ఎస్‌బీఐ మరో కొత్త లోన్‌ స్కీమ్‌.. వీరు సులభంగా రుణం పొందవచ్చు..!

Huzurabad by election: హుజూరాబాద్ ఉప ఎన్నికకు రంగం సిద్ధం.. చకచక ఏర్పాట్లలో అధికారులు.. వ్యాక్సినేషన్‌లోనూ జోరు!