Road Accident: ఏపీలోని విజయనగరం జిల్లా సుంకరిపేట దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ లారీ రెండు ఆర్టీసీ బస్సులను ఢీకొట్టడంతో ఐదుగురు మృతి చెందారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. రోడ్డుపక్కన వేసిన మంటలతో దట్టంగా పొగలు అలుముకోవడంతో డ్రైవర్లకు రోడ్డు కనిపించకపోవడంతతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఎన్‌హెచ్ 26పై కిలోమీటర్ల మేరక వాహనాలు నిలిచిపోయాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రమాదవశాత్తు జరుగుతున్న ఘోర రోడ్డు ప్రమాదాల వల్ల ఎందరో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.
నాన్నా.. త్వరగా రండి.. నన్ను బయటకు తీయండి.. బస్సు చక్రాల కింద నలిగి.. చికిత్స పొందుతూ మృతి