Road Accident: రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రమాదాలు జరుగకుండా పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం ఆగడం లేదు. వాహన డ్రైవర్ల నిర్లోక్ష్యం, అతివేగం, ఓవర్‌టెక్, మద్యం తాగి వాహనాలు నడపడం తదితర కారణాల వల్ల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో అమాయకులు బలవుతున్నారు. తాజాగా సోమవారం అర్థరాత్రి అనంతపురం జిల్లా పెనుగొండ మండలంలోని కియా పరిశ్రమ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. మృతుల్లో ఇద్దరు యువతులున్నారు. లారీని వెనుక నుంచి వచ్చిన ఓ కారు వేగంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. కారు బెంగళూరు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగిన నలుగురు అనంతలోకాలకు వెళ్లిపోయారు. కాగా, విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఇలా ప్రతి రోజు ఏదో ఒక ప్రాంతంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల వల్ల ఎందరో అసువులు బాసుతున్నారు. వాహనాలు జాగ్రత్తగా నడపాలని, అతి వేగంగా నడపవద్దని పోలీసు అధికారులు ఎన్నిసార్లు చెప్పినా ఇంకా నిర్లక్ష్యం జరుగుతూనే ఉంది. ఆదివారం కూడా రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొన్న సంఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఇలా దేశ వ్యాప్తంగా వందలాదిగా మృతి చెందుతున్నారు.
LED TV: రూ.500లకే ఎల్‌ఈడీ టీవీ.. అసలు విషయం తెలిసి షాకైన స్థానికులు.. పోలీసులకు సమాచారం
Fire Accident: అగ్ని ప్రమాదం జరిగి 24 గంటలు గడవకముందే మరో భారీ అగ్ని ప్రమాదం.. ఇద్దరు భవనంపైకి దూకి