AP Sand Tenders: ఇసుక టెండర్ల బాధ్యత ఎంఎస్‌టీసీకి అప్పగించిన ఏపీ ప్రభుత్వం.. జోన్‌ల వారీగానే టెండర్లు

|

Jan 05, 2021 | 4:27 AM

AP Sand Tenders:  ఇసుక వేలానికి సంబంధించి టెండర్ల ప్రక్రియ బాధ్యతను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ మెటల్‌ అండ్‌ స్క్రాప్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ (ఎంఎంటీసీ)కు....

AP Sand Tenders: ఇసుక టెండర్ల బాధ్యత ఎంఎస్‌టీసీకి అప్పగించిన ఏపీ ప్రభుత్వం.. జోన్‌ల వారీగానే టెండర్లు
Follow us on

AP Sand Tenders: ఇసుక వేలానికి సంబంధించి టెండర్ల ప్రక్రియ బాధ్యతను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ మెటల్‌ అండ్‌ స్క్రాప్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ (ఎంఎస్ టీసీ)కు అప్పగించింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ ఒప్పందం చేసుకుంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో గనుల శాఖ డీఎంజీ వెంకటరెడ్డి ఎంఎస్‌టీసీ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ జైకుమార్‌ దీనిపై సంతకాలు చేశారు. రాష్ట్ర పంచాయతీరాజ్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో సోమవారం జరిగిన సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో ఇసుక దోపిడి జరిగిందని, అందుకే కొత్త విధానాన్ని తీసుకొచ్చామని అన్నారు. దీని ప్రకారం రాష్ట్రాన్ని మూడు జోన్లుగా ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లా వరకు ఒక జోన్‌గా, అలాగే పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు ఒక జోన్‌, నెల్లూరు, కడప, చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాలు ఒక జోన్‌గా విభజించినట్లు చెప్పారు.

జోన్‌ వారీగానే విడివిడిగా టెండర్లు పిలుస్తామని, టెండర్ల విషయంలో ఎంఎస్‌టీసీకి మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలో ఇసుక సరఫరా చేస్తున్న అనుభవం ఉండటంతో ఈ బాధ్యతలు అప్పగించామన్నారు. టెండర్లు పిలవడం, వాటి సాంకేతిక బిడ్లు, ఆర్థిక అంశాలు పరిశీలన అన్ని ఎంఎస్‌టీసీ నివేదికను రాష్ట్ర సర్కార్‌కు ఇస్తుందని, దానిని అనుసరించి టెండర్లు ఎవరికి ఇవ్వాలన్నదానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి వెల్లడించారు.

నేను శాంతి కోసం ట్రై చేస్తుంటే.. వాళ్లు యుద్ధం అంటున్నారు.. జేసీ బ్రదర్స్‌‌కు ఎమ్మెల్యే పెద్దారెడ్డి కౌంటర్