Rain Alert: తెలుగు రాష్ట్రాలపై వరుణుడి ఉగ్రరూపం.. ఈ జిల్లాలకు భారీ రెయిన్ అలెర్ట్

వాన జోరు కాస్త తగ్గినా..వరద హోరు మాత్రం కొనసాగుతోంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు, రేపు వర్షాలు కొనసాగుతాయని ప్రకటించింది వాతావరణ శాఖ. పలు జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి.

Rain Alert: తెలుగు రాష్ట్రాలపై వరుణుడి ఉగ్రరూపం.. ఈ జిల్లాలకు భారీ రెయిన్ అలెర్ట్
Andhra Weather Report

Updated on: Aug 15, 2025 | 6:52 AM

ఏపీవాసులారా యువర్‌ అటెన్షన్‌ ప్లీజ్‌. రాబోయే కొన్ని గంటల వరకు ఏపీలోని కొన్ని జిల్లాలకు ఫ్లాష్‌ ఫ్లడ్స్‌ ముప్పు పొంచి ఉందని విశాఖ తుఫాన్‌ హెచ్చరికల కేంద్రం వార్నింగ్‌ బెల్స్‌ మోగిస్తోంది. పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఫ్లాష్‌ ఫ్లడ్స్‌ ముప్పు పొంచి ఉందని విశాఖ తుఫాన్‌ హెచ్చరికల కేంద్రం చెబుతోంది. పల్నాడు, ప్రకాశం, నంద్యాల.. ఈ జిల్లాలవాసులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెబుతోంది. అటు ఏపీలోని ఏలూరు, ఎన్టీఆర్‌ జిల్లాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. రాగల 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. సుమారు 7 నుంచి 12 సెంటిమీటర్ల వర్షం కురుస్తుందని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి, పల్నాడు, ప్రకాశం.. నంద్యాల, కర్నూలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ఇచ్చింది.

అటు తెలంగాణకు కూడా భారీ రెయిన్ అలెర్ట్ జారీ చేసింది. ఉత్తర కోస్తాఆంధ్ర, ఒడిస్సా తీరాల వెంబడి అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్, సౌత్ ఒరిస్సా తీరాల వెంబడి తీరం తాకే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో తెలంగాణలో రాగల రెండు రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. శుక్ర, శనివారాల్లో హైదరాబాద్ నగరంలో మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంది. కాగా, తెలంగాణలోని 12 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్.. 8 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

ఇది చదవండి: ఆరుగురు వ్యక్తులు, మూడు కార్లు.. ORRపై దూసుకొస్తున్న కాన్వాయ్.. డౌట్ వచ్చి ఆపి చూడగా

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి