మనం రెడీ : జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సిద్ధం, కేబినెట్ భేటీలో మంత్రులకు తేల్చిచెప్పిన సీఎం జగన్

ZPTC, MPTC ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని మంత్రులకు స్పష్టం చేశారు సీఎం జగన్‌. ఇవాళ అమరావతిలో జరిగిన కేబినెట్‌ భేటీలో పంచాయతీ ఫలితాలు, రాబోయే మున్సిపల్‌, .

  • Venkata Narayana
  • Publish Date - 3:20 pm, Tue, 23 February 21
మనం రెడీ : జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సిద్ధం, కేబినెట్ భేటీలో మంత్రులకు తేల్చిచెప్పిన సీఎం జగన్

ZPTC, MPTC ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని మంత్రులకు స్పష్టం చేశారు సీఎం జగన్‌. ఇవాళ అమరావతిలో జరిగిన కేబినెట్‌ భేటీలో పంచాయతీ ఫలితాలు, రాబోయే మున్సిపల్‌, పరిషత్‌ ఎన్నికలపై చర్చ జరిగింది. గతంలో ఎప్పుడూ లేనంతగా పంచాయతీల్లో 80 శాతం ఫలితాలు సాధించామని సీఎం అన్నారు. ఈ సందర్భంగా సీఎంకు అభినందనలు తెలిపారు మంత్రులు. ఈ సందర్భంగానే మిగిలిన ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ఇంకా ముందుగా నిర్వహించాలని కోరతామన్నారు. వ్యాక్సినేషన్‌ త్వరగా ఇవ్వకపోతే కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు సీఎం జగన్‌.

అంతకుముందు ఏపీ సీఎం జనగ్‌ అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో జరిగిన మంత్రివర్గం భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నవరత్నాలు అమలు క్యాలెండర్ కు కేబినెట్ ఆమోద తెలిసింది. రాజధాని అమరావతి పరిధిలో అసంపూర్ణ భవనాల నిర్మాణానికి, ఎన్ఆర్డిఏ కు మూడువేల కోట్లు బ్యాంకు గ్యారెంటీ ఇచ్చేందుకు కేబినెట్ అంగీకారం వెలిబుచ్చారు. కాకినాడ ఎస్‌ఈజెడ్‌ భూముల వ్యవహారంలో రైతులకు నష్టపరిహారాన్ని ఖరారు చేసే అంశంపైనా కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కమిటీ సూచించిన నష్ట పరిహారం కంటే ఎక్కువగా ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది.

ఎస్‌ఈజెడ్‌ పరిధిలోని ఆరు గ్రామాలను తరలించేందుకు మినహాయింపునిచ్చింది. వైఎస్సార్‌ స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణం కోసం భాగస్వామ్య సంస్థ ఎంపికకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈబీసీ నేస్తం పధకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద వచ్చే మూడేళ్లలో ఒక్కో మహిళ లబ్దిదారుకు రూ.45 వేలు అందించనున్నారు. కడప జిల్లాలో రెండు పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు సంబంధించి భూ కేటాయింపులపై కేబినెట్‌ చర్చించింది.

Read also : పొలిటికల్ హీట్ పెంచుతోన్న గట్టు వామన్‌రావు దంపతుల హత్య, ఒక్కొక్కటిగా తెరమీదకు వస్తున్న వివాదాలు