Rare Snake: కూలీల కంటపడిన అరుదైన పొడజాతి పాము.. భయపడి చంపేసిన స్థానికులు

Rare Snake: వేసవి ఎండల నుంచి ఉపశమనం ఇస్తూ.. తొలకరి పలకరించింది. అయితే పల్లెల్లో ఇది సర్పాలు బయటకు వచ్చే సమయం. ఎండలు తగ్గి కాసింత చల్లదనం..

Rare Snake:  కూలీల కంటపడిన అరుదైన పొడజాతి పాము.. భయపడి చంపేసిన స్థానికులు
Rare Snake

Updated on: Jun 15, 2021 | 1:32 PM

Rare Snake: వేసవి ఎండల నుంచి ఉపశమనం ఇస్తూ.. తొలకరి పలకరించింది. అయితే పల్లెల్లో ఇది సర్పాలు బయటకు వచ్చే సమయం. ఎండలు తగ్గి కాసింత చల్లదనం ఉన్న ఈ సమయంలో పాములు బయటకు వచ్చి సేద తీరడానికి చూస్తుంటాయి. ఇలాంటి సందర్భాల్లోనే గ్రామస్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో అరుదైన పొడపాము కనిపించింది. వివరాల్లోకి వెళ్తే..

పిఠాపురం మండలం గోకివాడ అక్కిరెడ్డివారి చెరువు గట్టు పై కొంతమంది ఉపాధి హామీ పనులు చేస్తున్నారు. ఈ సమయంలో పొడపాము వీరి కంటపడింది. పాము కంట పడగానే భయపడిన కూలీలు.. వెంటనే దానిని హతమార్చారు. ఇది కాట్రేగలపోడ జాతికి చెందిన పాముగా ఉపాధి కూలీలు చెప్పారు.

ప్రస్తుతం వర్షాలు పడడంతో పొలాల గట్లు, రాళ్లు, పుట్టలు వంటి ప్రదేశాల్లో ఉన్న పాములు బయటకు వచ్చి సంచరిస్తుంటాయని చెప్పారు.

ఇదే విషయంపై వైద్య నిపుణులు మాట్లాడుతూ.. రహదారులు, నివాసాల ఇటీవల కాలంలో పాముల బెడద ఎక్కువైందని చెప్పారు. అంతేకాదు పాము కాటు బారిన పడిన సందర్భాల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, పాము కాటుకు గురికాకుండా ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలేమిటి అన్న అంశాలపై చాలా మందికి అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. అవగణాలేమితో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని ఎవరికైనా పాముకాటు జరిగిన గంటలోపు ప్రభుత్వ ఆస్పత్రికి వెళి తే ప్రాణాపాయం తప్పుతుంది. నాటు వైద్యం జోలికి వెళితే అపాయం కొని తెచ్చుకున్నట్లేనని నిపుణులైన వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Also Read: మోనిత రచ్చ చేస్తే ఏం చేస్తావని కొడుకుని ప్రశ్నించిన సౌందర్య.. తన నిజ స్వరూపం కార్తీక్ కు చూపించనున్న మోనిత