Rare Fish: వారి జీవినాధారం చేపల వేట. ప్రతి రోజూ ఉదయం వెళ్లడం.. చేపలు పట్టి విక్రయించడం. అలా వచ్చిన డబ్బుతో జీవనాన్ని సాగించడం జరుగుతుంది. అయితే, ఏ రోజైనా లక్కు తగలకపోతుందా? మాంచి పులస చిక్కకపోతుందా? ఆదాయం పెరగకపోతుందా? అని ఎదురు చూస్తూ ఉన్నారు అక్కడి జాలర్లు. తాజాగా వారి ఎదురు చూపులకు ఫలితం దక్కింది. ఎట్టకేలకు జారల్ల వలకు పులస చిక్కింది. దాదాపు ఏడాది పాటు చిక్కని పులస.. ఇప్పుడు ఏకంగా సజీవంగా చిక్కింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా పాశర్లపూడి గోదావరిలో పులస చేప లభ్యమైంది. వరదల సమయంలో కనిపించని పులస జాడ.. ఇప్పుడు బుజ్జి అనే మత్స్యకారుడి వలకు చిక్కింది. ఈ పులస బరువు 800 గ్రాములుగా ఉంది. ఈ సంవత్సర కాలంలో కనిపించిన మొట్టమొదటి పులస చేపని చూసి స్థానిక మత్స్యకారులు మురిసిపోతున్నారు. కాగా, తన వలక చిక్కిన ఈ పులసను మత్స్యకారుడు రూ. 6,000 లకు విక్రయించాడు.