AP News: ప్రవాహానికి ఎదురీదుతుంది కానీ పులస కాదు.. కొనేందుకు ఎగబడ్డ జనం

| Edited By: Ram Naramaneni

Jul 04, 2024 | 12:52 PM

చేపలకు నీటి ప్రవాహానికి ఎదురీదే అరుదైనలక్షణం వీటికి ఉందట. శీతల ప్రాంతాలు.. చల్లటి నీరు ఉండే కొండల ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా సంచరిస్తాయట. ఇవి ఎంతో రుచిని కలిగి ఉంటాయని జాలర్లు చెబుతున్నారు. ఇది చాలా అరుదైన, విలువైన చేప అని చెబుతున్నారు.

AP News: ప్రవాహానికి ఎదురీదుతుంది కానీ పులస కాదు.. కొనేందుకు ఎగబడ్డ జనం
Rare Fish
Follow us on

ఆంధ్ర ఒడిస్సా సరిహద్దులో అరుదైన చేప జాలర్ల వలకు చిక్కింది. భారీ బరువు ఉండే ఈ చేప.. కనిపించడం అత్యంత అరుదు. మిలట్రీ మౌస్, గెలస్కోపి, టార్ ఫిష్  అనే పేర్లతో పిలవబడే ఈ చేప.. 50 కిలోల వరకు బరువు పెరుగుతుంది. వర్షాలు కురిసే సమయంలో రిజర్వాయర్ల నుంచి నీటి ప్రవాహానికి కొట్టుకొని వచ్చేస్తుంటాయి.

అల్లూరి సీతారామరాజు జిల్లా జీకేవీధి మండలం సీలేరు రిజర్వాయర్ లో జాలర్లు యదావిధిగా చేపలు వేటకు వెళ్లారు. ఓ జాలరికి 11కిలోల అతి అరుదైన గెలస్కోపి చేప వలకు చిక్కింది. దాన్ని వనములు నర్సింగ్ అనే మత్స్యకారుడు విక్రయించడానికి మార్కెట్ కు తీసుకువచ్చాడు. ఆ చేపను కొనుగోలు చేసేందుకు స్థానికులు ఎగబడ్డారు. ఫైనల్‌గా దాన్ని 4 వేల రూపాయలకు అమ్మినట్లు తెలిసింది. ఈచేప 5 కిలోల నుంచి 50 కిలోల వరకు బరువు పెరుగుతుంది. దీని రుచి కూడా చాలా బాగుంటుందట. చాలా అరుదుగా మాత్రమే ఈ చేపలు.. వలకు చిక్కుతాయని జాలర్లు చెబుతున్నారు.

ప్రవాహానికి ఎదురీదే లక్షణం..పోషకాలు పుష్కళం..

పులసల మాదిరిగా ఈ చేపలు కూడా ప్రవాహానికి ఎదురీదుతాయి.  ఈచేపలో 68శాతం ప్రోటీన్లు ఉంటాయి. ఓమెగా 3ఫ్యాటీ యాసీడ్స్ ఆరోగ్య విలువలు కలిగిన కొలాజన్ వంటివి ఉంటాయి. మనుషులకు ఆరోగ్యపరంగా ఉపయోగపడే ఎంతో విలువలు దీనిలో ఉన్నాయి. అల్లూరి ఏజెన్సీ కొండ ప్రాంతం అడవుల్లో నిత్యం నీరు ఉండే ప్రాంతాలలో లోతైన సీలేరు, డొంకరాయి, బలిమెలా రిజర్వాయర్లలో ఈ చేపలుంటాంయని జాలర్లు చెబుతున్నారు. ఈచేపలకు నీటి ప్రవాహానికి ఎదురీదే అరుదైన లక్షణం వీటికి ఉంది. కొండల మధ్య నీటి కొలనుల్లో జీవించే ఈ చేపలు వర్షాల ఉధృతికి కొట్టుకొని రిజర్వాయర్‌లోకి వస్తుంటాయని అంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..