మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు(Rape) రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఒంటరిగా కనిపిస్తే చాలు.. వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా ఈ నేరాలకు అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా కదులుతున్న బస్సులో ఓ మహిళపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. కత్తితో బెదిరించి(Assault with knife) దాడి చేశాడు. అంతే కాకుండా బాధితురాలి నుంచి నగదు లాక్కున్నాడు. ఈ ఘటనపై మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి(West Godavari) జిల్లాకు చెందిన ఓ యువతి హైదరాబాద్‌లోని మాదాపూర్ లో తన ఇద్దరు కూతుర్లతో కలిసి నివాసముంటోంది. ఆమె బేబీ కేర్ టేకర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. హైదరాబాద్ నుంచి సొంతూరుకు వెళ్లేందుకు.. ఈ నెల 23న కూకట్‌పల్లిలో ప్రైవేటు బస్సు ఎక్కారు. ఆ బస్సులో ప్రయాణికులు తక్కువ మంది ఉండటంతో పాటు చివరి సీటు కేటాయించారు.
అర్ధరాత్రి 12.30 గంటలకు నిద్రపోతున్న సమయంలో డ్రైవర్ తన దగ్గరకు వచ్చి, కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించింది. 24న ఉదయం బస్సు దిగుతుండగా మళ్లీ బెదిరించి రూ.7 వేలు తీసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధితురాలికి న్యాయం చేయాలని ఆమె బంధువులు డిమాండ్ చేస్తూ.. జేఎన్‌టీయూ స్నాతకోత్సవంలో పాల్గొని తిరిగివెళ్తున్న గవర్నర్ తమిళిసై కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు.
Also Read
Devi Sri Prasad: ఆ దర్శకుడితో పనిచేయడం చాలా కంఫర్ట్‌గా ఉంటుంది: దేవీశ్రీ
Russia – Ukraine Conflict: పారిపోను.. ఆయుధాలివ్వండి.. అమెరికా ఆఫర్‌కు ఉక్రెయిన్ అధ్యక్షుడి రిప్లై..