Ashok Gajapathi Raju: రామతీర్థం వివాదంలో రాజకీయ రచ్చ.. అశోక్‌గజపతి రాజు అరెస్ట్‌పై కొనసాగుతున్న ఉత్కంఠ..

అశోక్‌ గజపతిరాజుపై పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే టీడీపీకి అంతే స్థాయిలో కౌంటర్‌ ఇస్తున్నారు వైసీపీ శ్రేణులు. ఈ నేపథ్యంలో అశోక్‌ గజపతిరాజును అరెస్ట్‌ చేస్తారా..? లేదంటే..

Ashok Gajapathi Raju: రామతీర్థం వివాదంలో రాజకీయ రచ్చ.. అశోక్‌గజపతి రాజు అరెస్ట్‌పై కొనసాగుతున్న ఉత్కంఠ..
Ashok Gajapathi Raju

Updated on: Dec 24, 2021 | 9:38 AM

విజయనగరం జిల్లాలో టీడీపీ వర్సెస్‌ వైసీపీ. రామతీర్థం ఆలయ శంకుస్థాపన ఘటన వివాదం కంటిన్యూ అవుతోంది. తనపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన కామెంట్స్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు అశోక్‌ గజపతిరాజు. ఆయనతో పాటు టీడీపీ కూడా బొత్స వ్యాఖ్యలపై మండిపడుతోంది. అశోక్‌ గజపతిరాజుపై పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే టీడీపీకి అంతే స్థాయిలో కౌంటర్‌ ఇస్తున్నారు వైసీపీ శ్రేణులు. ఈ నేపథ్యంలో అశోక్‌ గజపతిరాజును అరెస్ట్‌ చేస్తారా..? లేదంటే నోటీసులిస్తారా అన్న అంశంలో ఉత్కంఠ నెలకొంది.

మాన్సస్‌ ట్రస్ట్ చైర్మన్‌గా ఉన్న అశోకగజపతి రాజు రామతీర్థం ఆలయ కమిటీకి కూడా చైర్మన్‌. అయితే ఆలయ నిర్మాణ శంకుస్థాపన సమయంలో ఆనవాయితీ ఫాలో అవ్వడంలేదని.. సంప్రదాయాలను పక్కనపెట్టారని ఆశోక్‌గజపతి ఆగ్రహించారు. ఆ తర్వాత రామతీర్థం కొండపై నిన్న శిలాఫలకాన్ని తొలగించిన అశోక్‌ గజపతి రాజుపై కేసు నమోదైంది. తమ విధులకు ఆటంకం కలిగించారని ఆయనపై ఫిర్యాదు చేశారు ఈవో DVV ప్రసాద్. శంకుస్థాపన జరిగే ఏర్పాట్ల దగ్గర అనుచితంగా వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో అశోక్ గజపతి రాజుతో పాటు మరికొందరిపై 473, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

ఆలయ అనువంశిక ధర్మకర్తగా అశోక్ గజపతికి ఎలాంటి ప్రోటోకాల్ ఉల్లంఘన జరగలేదన్నారు ఈవో ప్రసాద్‌. కావాలనే ఆయన రాద్ధాంతం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి: Conjoined Twins: వారు ఇద్దరు కాదు ఒక్కరు.. పంజాబ్ కుర్రాళ్లు ఉద్యోగం సాధించారు.. స్ఫూర్తిగా నిలిచారు..

Childhood obesity: తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్.. బొద్దుగా మారుతున్న మీ పిల్లపై తాజా పరిశోధనల్లో నిజాలు..