ఇదేం ట్విస్ట్.. చప్పుడు కాకుండా పోలీస్ స్టేషన్‌కు రమానందన

ఆర్థిక మోసాల ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్‌ రమానందన ఇబ్రహీంపట్నం పోలీసుల ఎదుట హాజరయ్యారు. ఉద్యోగాలు, సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్‌ (CoS) ఇప్పిస్తామని మోసం చేశారన్న ఫిర్యాదుపై ఆమెను పోలీసులు విచారించారు. అయితే విచారణలో ఆశించిన స్థాయిలో సమాధానాలు రాలేదని సమాచారం. ..

ఇదేం ట్విస్ట్.. చప్పుడు కాకుండా పోలీస్ స్టేషన్‌కు రమానందన
Ramanandana

Updated on: Sep 16, 2026 | 8:44 AM

ఆర్థిక మోసాల ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్‌ రమానందన ఇబ్రహీంపట్నం పోలీసుల ఎదుట మంగళవారం హాజరయ్యారు. అయితే విచారణలో ఆమె నుంచి పోలీసులకు పూర్తి స్థాయిలో సమాధానాలు రాలేదని సమాచారం. తనపై ఉన్న లుకౌట్‌ సర్క్యులర్‌ (LOC) ఎత్తేస్తే లండన్‌ వెళ్లిపోతానని ఆమె పోలీసులకు తెలిపినట్లు సమాచారం. మరోవైపు తన భర్త మధుకర్‌ భారత్‌కు వచ్చిన తర్వాత ఆయనను విచారించాలని న్యాయవాదుల ద్వారా పోలీసులను కోరినట్లు తెలుస్తోంది.

అసలు కేసేంటి?

డెస్టినీ కన్సల్టెన్సీ ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తామని, సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్ (CoS) ఇప్పిస్తామంటూ మోసం చేశారంటూ క్రాంతికుమార్‌ అనే వ్యక్తి ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో భాగంగా ఈ నెల 8న పోలీసులు రమానందనను విచారించారు. అయితే ఆమె విచారణకు సహకరించలేదని పోలీసులు పేర్కొన్నట్లు సమాచారం. దీంతో 16న మరోసారి విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు. న్యాయవాదుల సూచనల మేరకు రిక్వెస్ట్‌ లెటర్‌ పంపిన రమానందన.. నిర్ణయించిన తేదీ కంటే ఒకరోజు ముందుగానే పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు.

మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్సై రాజులు ఆమెను విచారించినట్లు సమాచారం. పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఆమె నుంచి ఆశించిన స్థాయిలో సమాధానాలు రాలేదని తెలుస్తోంది. అయితే గతంలో పోలీసులు అడిగిన కొన్ని ప్రశ్నలకు లిఖితపూర్వకంగా సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం. ఇప్పుడు అసలు టెన్షన్‌ ఏంటంటే.. లుక్ ఔట్ సర్కులర్ విషయంలో పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? భర్త మధుకర్‌ భారత్‌కు వచ్చిన తర్వాత విచారణ ఎలా సాగుతుంది? అనే అంశాలపై ఆసక్తి నెలకొంది.

Loading...
Unable to load recommendations.
Follow Us