
ఏపీలో కూటమికి తొలివిజయం నమోాదయ్యింది. రాజమండ్రి రూరల్‌లో టీడీపీ అభ్యర్థి గోరంట్ల బచ్చయ్య చౌదరి బంపర్ మెజార్టీతో గెలుపొందారు. గోరంట్లకు 63,056 ఓట్ల మెజారిటీ వచ్చినట్లు తెలిసింది. ఇక ఆంధ్రాలో కూటమి స్వీప్ చేసిందనే చెప్పాలి. ఇప్పటివరకు అందుతున్న రిపోర్ట్ ప్రకారం.. టీడీపీ 130 స్థానాల్లో, జనసేన 19, బీజేపీ 6 స్థానాల్లో లీడ్‌లో ఉన్నాయి. వైసీపీ కేవలం 20 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తుంది.
అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్‌కల్యాణ్ విజయం సాధించారు. మంగళగిరి నుంచి పోటీ చేసిన నారాలోకేష్, హిందూపూర్ టీడీపీ అభ్యర్థి బాలకృష్ణలు సైతం విజయం అందుకున్నారు. కాగా ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూటమి స్వీప్ చేసింది. ఇక బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, బుగ్గన రాజేంద్రనాథ్ అంజాద్ బాషా, ఉషశ్రీ చరణ్, పీడిక రాజన్న దొర , కొట్టు సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, దాడిశెట్టి రాజా, అంబటి రాంబాబు , విడదల రజిని, ఆది మూలపు సురేష్ , మేరుగు నాగార్జున తదితర మంత్రులు ఓటమి పాలయ్యారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..