Andhra: ఇంద్రధనస్సు విల్లు అయింది.. ధ్వజస్తంభం బాణంగా మారింది..

వాన కురిసిన తర్వాత మబ్బులు చెదరగానే ఆకాశంలో రంగుల విల్లు విరిసింది. బాపట్ల జిల్లా మేదరమెట్లలో కనువిందు చేసిన ఆ ఇంద్రధనుస్సు, స్థానిక శివాలయం వద్ద ధ్వజస్తంభాన్ని తాకేలా విరబూసి భక్తులను మంత్రముగ్ధులను చేసింది. ఆ దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి ...

Andhra: ఇంద్రధనస్సు విల్లు అయింది.. ధ్వజస్తంభం బాణంగా మారింది..
Rainbow

Updated on: Oct 23, 2025 | 4:15 PM

మాములుగా.. ఆకాశంలో హరివిల్లు కనిపిస్తే ఆ అనుభూతి ఎంతో ఆనందకరంగా ఉంటుంది. అలాంటిది ఇక్కడ శివాలయం పైన.. అది ధ్వజస్తంభం వద్ద.. విల్లు ఎక్కుపెట్టినట్లుగా ఉన్న ఈ దృశ్యాన్ని చూస్తే తన్మయత్వానికి లోనవ్వాల్సిందే. వాతావరణంలోని నీటి బిందువులపై సూర్యకిరణాలు పడటం వల్ల అవి వక్రీభవనం చెంది, విభిన్న రంగుల్లో ప్రతిఫలించడాన్ని ఇంద్రధనుస్సు అంటారని మనకు తెలిసిన విషయమే. ప్రకృతీ అందాల్లో ఇదో అద్భుతం.

బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం మేదరమెట్ల గ్రామం బుధవారం ఈ అందమైన దృశ్యానికి వేదికైంది. మధ్యాహ్నం నుంచి దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో వర్షం కురిసింది. కొద్దిసేపటికి వాన ఆగగానే ఆకాశం మెల్లగా స్పష్టమవుతుండగా, వర్షపు చినుకులపై సూర్యకాంతి పడడంతో ఆకాశం మీద అద్భుతమైన ఇంద్రధనుస్సు ఏర్పడింది.

Also Read: చేప అనుకుని చేతుల్తో పట్టి ఒడ్డున వేశారు.. తీరా చూస్తే.. ఓర్నాయనో..

గ్రామమంతా ఒక్కసారిగా ఆకాశం వైపు చూపులు మళ్లాయి. రంగురంగుల కాంతుల విల్లు ధ్వజస్తంభాన్ని తాకేలా ఆకాశాన్ని అలంకరించడం విశేషంగా కనిపించింది. శివాలయం వద్ద ఉన్న భక్తులు ఆ అందమైన దృశ్యాన్ని చూసి మంత్రముగ్ధులయ్యారు. కొందరు మొబైల్ ఫోన్లలో ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.