AP Rains: ఏపీలో ఇక వర్షాలు తగ్గాయా.? ఇదిగో 3 రోజుల వాతావరణ ఇలా.. తాజా వెదర్ రిపోర్ట్

|

Dec 13, 2024 | 1:43 PM

గల్ఫ్ ఆఫ్ మన్నార్, దానికి ఆనుకుని ఉన్న కొమోరిన్ ప్రాంతంపై గల అల్పపీడనము ఇప్పుడు లక్షద్వీప్ దానికి ఆనుకుని ఉన్న మాల్దీవుల మీద ఉంది. ఆ వాతావరణ వివరాలు ఇలా..

AP Rains: ఏపీలో ఇక వర్షాలు తగ్గాయా.? ఇదిగో 3 రోజుల వాతావరణ ఇలా.. తాజా వెదర్ రిపోర్ట్
Ap Rains
Follow us on

గల్ఫ్ ఆఫ్ మన్నార్, దానికి ఆనుకుని ఉన్న కొమోరిన్ ప్రాంతంపై గల అల్పపీడనము ఇప్పుడు లక్షద్వీప్ దానికి ఆనుకుని ఉన్న మాల్దీవుల మీద ఉంది. సంబంధిత ఎగువ వాయు ఉపరితల ఆవర్తనము సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇది రాగల 24 గంటల్లో పశ్చిమ దిశగా కదిలి బలహీన పడే అవకాశం ఉంది. డిసెంబర్ 14, 2024 నాటికి దక్షిణ అండమాన్ సముద్రంపై ఎగువ వాయు ఉపరితల ఆవర్తనము ఏర్పదే అవకాశము ఉన్నది తదుపరి 48 గంటల్లో అది అల్పపీడనముగా మారి పశ్చిమ-వాయువ్య దిశగా తమిళనాడు తీరాల వైపు కదులుతుంది. ఆంధ్ర ప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య / తూర్పు దిశ గా గాలులు వీస్తున్నాయి.

వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన :
————–

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-
—————————————-

ఈరోజు , రేపు, ఎల్లుండి :-

వాతావరణం పొడిగా ఉండే అవకాశముంది .

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ :-
——————————

ఈరోజు, రేపు, ఎల్లుండి ;-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

రాయలసీమ;-
———

ఈరోజు :-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.

రేపు, ఎల్లుండి ;-
———–

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి