Rain Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు చల్లని కబురు.. రానున్న మూడు రోజులపాటు వర్షాలు: IMD

|

Apr 19, 2022 | 7:34 AM

AP Telangana Weather Updates: ఎండలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ ఎండల నుంచి ఉపశమనం కలిగించేలా చల్లని ప్రకటన చేసింది. ఉత్తర తమిళనాడు తీరం వెంబడి నైరుతి బంగాళాఖాతంలో

Rain Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు చల్లని కబురు.. రానున్న మూడు రోజులపాటు వర్షాలు: IMD
Rains
Follow us on

AP Telangana Weather Updates: ఎండలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ ఎండల నుంచి ఉపశమనం కలిగించేలా చల్లని ప్రకటన చేసింది. ఉత్తర తమిళనాడు తీరం వెంబడి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడినట్లు తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అక్కడక్కడ ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ, హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపాయి. విదర్భ నుంచి తెలంగాణ, ఏపీ మీదుగా ఉత్తర కర్ణాటక వరకు ఏర్పడిన ఉపరితల ద్రోణి సోమవారం బలహీనపడినట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని కారణంగా వాయుగుండం మరింత బలపడే అవకాశమున్నట్లు తెలిపింది.

ఈ వాయుగుండం ప్రభావంతో వచ్చే ఐదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని పుదుచ్చేరి, కరైకాల్‌, కర్ణాటక ఈదురు గాలులతో కూడిన చెదురుమదురు వర్షాలు కురుసే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ఇదిలాఉంటే.. దేశంలోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఓ వైపు ఎండలు, మరోవైపు ఉక్కపోత, వేడితో ప్రజలు అల్లాడుతున్నారు. సోమవారం ఢిల్లీలో రికార్డు స్థాయిలో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది.

Also Read:

Petrol-Diesel Price Today: సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న చమురు ధరలు.. 14రోజుల తర్వాత ఎలా ఉన్నాయంటే?

Srisailam: నేడు శ్రీశైలంలో భ్రమరాంబదేవికి కుంభోత్సవం.. పలు సేవలు రద్దు..