Andhra Pradesh Rain Alert: ఆంధ్రప్రదేశ్‌ను వర్షాలు వీడడంలేదు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. రాయలసీమ, కోస్తాఆంధ్రాలోని పలు ప్రాంతాలు ఇప్పటికే నీటమునిగాయి. జలప్రళయంతో దాదాపు 50మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో వాతావరణశాఖ మరో హెచ్చరిక చేసింది. మరో మూడు రోజులపాటు ఏపీలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. నిన్న దక్షిణ అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఈరోజు ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 3 .1కిలోమీటర్లు ఎత్తులో విస్తరించిఉంది. ఈ ఉపరితల ఆవర్తనం నుంచి ఒక అల్పపీడన ద్రోణి ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాలనుంచి తమిళనాడు తీరం వరకు సగటు సముద్ర మట్టానికి 3 .1కిలోమీటర్లు ఎత్తులో వ్యాపించి ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. దీని ఫలితంగా మరో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు..
ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం:
ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర:
ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది. ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది.
రాయలసీమ:
ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది. ఎల్లుండి తేలికపాటినుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Also Read: