Weather Alert: మరో మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. బంగాళాఖాతంలో ఆవర్తనం

మరో రెండు రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఉభయ తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన నిస్తూ భారత వాతావరణ శాఖ తాజా ప్రకటన జారీ చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. మరో 48 గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. మయన్మార్ తీరానికి అనుకుని తూర్పు మధ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఉపర్తల ఆవర్తనం ప్రభావంతో ఆ పరిసర ప్రాంతాలపై అల్పపీడనం పడుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది.

Weather Alert: మరో మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. బంగాళాఖాతంలో ఆవర్తనం
Rains

Edited By: Aravind B

Updated on: Sep 12, 2023 | 10:38 AM

మరో రెండు రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఉభయ తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన నిస్తూ భారత వాతావరణ శాఖ తాజా ప్రకటన జారీ చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. మరో 48 గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. మయన్మార్ తీరానికి అనుకుని తూర్పు మధ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఉపర్తల ఆవర్తనం ప్రభావంతో ఆ పరిసర ప్రాంతాలపై అల్పపీడనం పడుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. రుతుపవన ద్రోని కూడా కొనసాగుతోంది. వీటి ప్రభావంతో.. ఈనెల 15 వరకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది భారత వాతావరణ శాఖ. కోస్తాలో తెలైకపాటి నుంచి మోస్తారు వర్షాలు.. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తాజా వెదర్ బులిటన్లో ఐఎండి పేర్కొంది.

ఈరోజు కోస్తా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతిపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. మిగిలిన చోట్ల తేలికపాటి వర్షం పడే అవకాశం.. పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. సముద్రంలో మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని సూచిస్తుంది భారత వాతావరణ శాఖ. ఈనెల 15 వరకు ఈ సూచనలు పాటించాలని ప్రకటించింది. మరోవైపు తెలంగాణలో కూడా ఐదు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. పలు ప్రాంతాల్లో ఉరములు, మెరుపులతో కూడిన తెలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. మంగళవారం, బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది.