రేపు బెజవాడలో రాహుల్, జగన్..!

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని విస్తృతం చేశాయి. అంతేకాదు పార్టీ అగ్ర నేతలందరూ కూడా వీలైనన్ని ఎక్కువ సభలు, రోడ్ షోల్లో పాల్గొంటూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఒకే రోజు విజయవాడ, కృష్ణా జిల్లాల్లో పర్యటించనున్నారు. కాగా రేపు బెజవాడ రానున్న కాంగ్రెస్ చీఫ్ రాహుల్… అక్కడ నిర్వహించే బహిరంగ […]

రేపు బెజవాడలో రాహుల్, జగన్..!

Edited By:

Updated on: Apr 05, 2019 | 7:55 PM

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని విస్తృతం చేశాయి. అంతేకాదు పార్టీ అగ్ర నేతలందరూ కూడా వీలైనన్ని ఎక్కువ సభలు, రోడ్ షోల్లో పాల్గొంటూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఒకే రోజు విజయవాడ, కృష్ణా జిల్లాల్లో పర్యటించనున్నారు.

కాగా రేపు బెజవాడ రానున్న కాంగ్రెస్ చీఫ్ రాహుల్… అక్కడ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొనున్నారు… ఇక రాష్ట్రం మొత్తం చుట్టేస్తున్న వైఎస్ జగన్… రేపు మైలవరంలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్నారు. ఇలా రెండు పార్టీల నేతలు ఒకేసారి విజయవాడ చేరుకోవడం విశేషం.