చేపల కోసం వలవేసిన జాలర్లకు షాకింగ్ దృశ్యం దర్శనమిచ్చింది. నీళ్లలోంచి బరువుగా వచ్చిన వలను చూసిన మత్స్యకారులు తమ పంట పడిందని సంబరపడ్డారు. కానీ, తీర వలలో పడ్డ జీవిని చూసి ఒక్కసారిగా కంగుతిన్నారు. ఎందుకంటే, ఆ వలలో పడింది చేపలు కాదు…భారీ కొండచిలువ. జాలర్లు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది.
నెల్లూరు జిల్లా సంగం సమీపంలోని పెన్నానది వద్ద చేపలు పట్టే వలలో కొండ చిలువ చిక్కింది. సోమశిల జలాశయం నుండి దిగువకు నీటిని విడుదల చేయడంతో పెన్నానది ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో సంగం వద్ద పెన్నానదిలో మత్స్యకారులు జోరుగా చేపల వేట సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ జాలరి విసిరిన వలలో 7 అడుగుల పొడవైన కొండ చిలువ చిక్కుకుంది. వల బరువుగా ఉడంటంతో పెద్ద చేపే పడిందని భావించిన మత్స్యకారుడు సంతోషంగా వలను బయటకు లాగిచూడగా చేపలకు బదులు కొండచిలువ కనపడటంతో భయంతో హడలెత్తిపోయాడు. చుట్టుపక్కల ఉన్న జాలర్ల సాయంతో వలను పక్కకు తెచ్చి వలలో చిక్కుకున్న కొండ చిలువను చిన్నగా రక్షించి సమీపంలోని అడవిలో వదిలేశారు. కొండ చిలువను చూసేందుకు జనాలు భారీ సంఖ్యలో అక్కడికి వచ్చారు. పాపం ఆ జాలరికి చేపలు పడకపోగా, లేనిపోని ప్రయాస పడాల్సి వచ్చింది.
Also Read: సజ్జనార్ నోటీసులు.. దిగొచ్చిన రాపిడో…
అదిరిపోయిన అయ్యగారి అభిమాని డ్యాన్స్.. కింగ్ సాంగ్‌కు ఊరమాస్ స్టెప్పులు