
Andhra Pradesh: సాధారణంగా ఇంటి కరెంట్ బిల్లు ఎంత వస్తుంది. వందల్లోనో, లేదంటే… కాస్త ఎక్కువగా వినియోగిస్తే వేలలో వస్తుంటుంది. అదే, చిన్నపాటి దుకాణాలు, మెకానిక్ షెడ్లకు కమర్షియల్ బిల్లు పేరిట కాస్త సాధారణం కంటే ఎక్కువగానే వస్తుంటుంది. కానీ, ఓ చిన్నపాటి పంక్చర్ షాప్ కు వచ్చిన కరెంట్ బిల్లు చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. ఆ బిల్లును చూసిన యజమానికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యిందనే చెప్పాలి. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
కర్నూలు జిల్లా ఆదోనిలో ఓ పంక్చర్ షాప్ ఉంది. దానికి వచ్చిన కరెంటు బిల్లు చూస్తే.. ఎవరికైనా షాక్ కొట్టినంత పనవుతుంది. చిన్నపాటి దుకాణానికి ఏకంగా 57 వేల రూపాయల కరెంటు బిల్లు వచ్చింది. బిల్ కొట్టే వారు ఆ మేరకు బిల్లును షాపు యజమానికి ఇవ్వగా అది చూసి షాక్ అవడం అతని వంతు అయ్యింది. ఇంత భారీ మొత్తంలో కరెంట్ బిల్లు రావడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఆదోనిలోని బావి వీధిలో బసవ అనే వ్యక్తి పంక్చర్ షాప్ నిర్వహిస్తున్నాడు. కాగా, తనకు ఉన్న చిన్న పంక్చర్ దుకాణానికి 57వేల 965 రూపాయల కరెంట్ బిల్లు రావడంపై అతని షాక్‌కు గురయ్యాడు. ఒక బల్బు.. ఒక్క ఫ్యాను మాత్రమే ఉన్న షాప్ కు ఇంత పెద్ద మొత్తంలో కరెంట్ బిల్లు రావడంతో బాధితుడు లబోదిబోమంటున్నాడు. మరి అధికారులు దీనిపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
Also read:
President Phone Call: తెలంగాణ జడ్చర్ల వాసికి రాష్ట్రపతి ఫోన్..!(Video)
Paata Uttej: నా భవిష్యత్తుని ఇలా వదిలేశావ్ ఏంటమ్మ.. కన్నీరు పెట్టిస్తున్న ఉత్తేజ్ కూతురి పోస్ట్..