ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రవేట్ ల్యాబ్ టెక్నిషియన్లు.. అవుట్ పోస్ట్ పోలీసులకు అప్పగించిన సూపరింటెండెంట్‌

| Edited By: Subhash Goud

Jul 13, 2024 | 11:52 AM

అది ప్రభుత్వ వైద్య శాల.. ఉమ్మడి గుంటూరు జిల్లాకే కాదు మరో నాలుగు జిల్లాల రోగులకు అతి పెద్ద ఆసుపత్రి అది. రోజు పదివేల మంది వస్తూ పోతూ ఉండే వైద్యశాలలో ప్రవేటు వ్యక్తుల దోపిడి పెరిగిపోయింది. దీంతో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ అర్దరాత్రి తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో తనకు తారసపడిన వారిని పోలీసులుకు పట్టించారు. గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో ఈసిజి విభాగంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని..

ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రవేట్ ల్యాబ్ టెక్నిషియన్లు.. అవుట్ పోస్ట్ పోలీసులకు అప్పగించిన సూపరింటెండెంట్‌
Hospital
Follow us on

అది ప్రభుత్వ వైద్య శాల.. ఉమ్మడి గుంటూరు జిల్లాకే కాదు మరో నాలుగు జిల్లాల రోగులకు అతి పెద్ద ఆసుపత్రి అది. రోజు పదివేల మంది వస్తూ పోతూ ఉండే వైద్యశాలలో ప్రవేటు వ్యక్తుల దోపిడి పెరిగిపోయింది. దీంతో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ అర్దరాత్రి తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో తనకు తారసపడిన వారిని పోలీసులుకు పట్టించారు. గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో ఈసిజి విభాగంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, రాత్రి వేళలో వైద్యులు టెక్నిషియన్లు అందుబాటులో ఉండటంలేదన్న ఆరోపణులు వచ్చాయి. ఆరోపణలు రావడమే కాదు ఏకంగా సూపరింటిండెంట్ కిరణ్ కుమార్ కు కొంతమంది రోగులు ఫిర్యాదు చేశారు. దీంతో రాత్రి పన్నెండు గంటల తర్వాత సూపరింటిండెంట్ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

అర్ధరాత్రి సమయంలో ఆసుపత్రికి వచ్చిన సూపరింటిండెంట్ అనేక అవకతవకలు కనిపించాయి. ఈసిజి విభాగంలో గత ఆరు నెలల నుండి రాత్రి సమయంలో ఒక్కరే ఉంటున్నారని గుర్తించారు. నిబంధనల ప్రకారం ఇద్దరూ అక్కడ పనిచేయాల్సి ఉంది. ఈసిజి రీల్స్ ను గవర్నమెంట్ ఆసుపత్రి నుండి తీసుకెళ్లి బయట విక్రయిస్తున్నట్లు ఆయన పరిశీలనలో తేలింది. హాస్పిటల్ లో సూపరింటిండెంట్ పరిశీలిస్తున్న సమయంలో ల్యాబ్ టెక్నిషియన్ల ఆగడాలు పెచ్చుమీరినట్లు పలువురు రోగులు ఆయన ద్రుష్టికి తీసుకొచ్చారు. ప్రవేటు ల్యాబ్స్ నుండి వస్తున్న టెక్నిషియన్లు ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు.

అదే సమయంలో ప్రవేటు ల్యాబ్ టెక్నిషియన్లు బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసుకొని వెలుతూ సూపరింటిండెంట్ కు కనిపించారు. దీంతో వెంటనే ఆయన వారిని ప్రశ్నించి బయట వ్యక్తులు ఎలా ఆసుపత్రిలోకి వస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు అతన్ని అవుట్ పోస్ట్ పోలీసులకు అప్పగించారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనిపై రోగులు సంత్రుప్తి వ్యక్తం చేశారు. ఇలా రెండు గంటల పాటు సూపరింటిండెంట్ ఆసుపత్రి మొత్తాన్ని చుట్టేశారు. దీంతో సిబ్బందితో పాటు వైద్యుల్లోనూ కదలిక వచ్చింది. ప్రతి రోజూ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తే బాగుంటుందని రోగులు చెప్పుకుంటున్నారు.


మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి