AP MPTC ZPTC Elections Result: ప్రశాంతంగా కౌంటింగ్ ప్రక్రియ.. సాయంత్రం కల్లా ఫలితాలు

|

Sep 19, 2021 | 11:24 AM

AP MPTC ZPTC Elections Result Updates: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోందని గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో...

AP MPTC ZPTC Elections Result: ప్రశాంతంగా కౌంటింగ్ ప్రక్రియ.. సాయంత్రం కల్లా ఫలితాలు
Gopala Krishna Dwivedi
Follow us on

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోందని గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో కౌంటింగ్ సిబ్బందికి అవసరమైన శిక్షణ అందించి, కౌంటింగ్ సెంటర్లలో ఏర్పాట్లు చేశామని తెలిపారు. మొత్తం 515 జడ్పీటీసీ,7220 ఎంపీటీసీ స్థానాల్లో కౌంటింగ్ జరుగుతోందని అన్నారు. పలు కారణాలతో 6 చోట్ల బ్యాలెట్ పేపర్లు దెబ్బతిన్నాయి. రెండు చోట్ల బ్యాలెట్ పేపర్లకు చెదలు పట్టాయి. నాలుగు చోట్ల తడిచిపోయాయి. గుంటూరు జిల్లా తాడికొండ మండలం రావెల, బీజత్ పురం, శ్రీకాకుళం జిల్లాలో సొరబుచ్చి మండలం షలాంత్రిలో బ్యాలెట్ పేపర్లు దెబ్బతిన్నాయి.

విశాఖ పట్నంలో ముక్కవారిపాలెం మండలం తూటిపల్ల,పాపయ్యపాలెం లో బ్యాలెట్లు తడిశాయి. బ్యాలెట్ పేపర్ల వాలిడేషన్ పై స్థానికంగా కలెక్టర్లు,రిటర్నింగ్ అధికారులు పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. ఎక్కడైనా రీపోల్ అవసరమనుకుంటే దానిపై ఎస్ ఈ సీ తుది నిర్ణయం తీసుకుంటుంది. ఇలాంటి చిన్న ఘటనలు మినహా.. అంతా ప్రశాంతంగా సాగుతోందని ప్రకటించారు. ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు త్వరలోనే వస్తాయని అన్నారు. జడ్పీటీసీ ఫలితాలు సాయంత్రం కాని.. రాత్రి వరకు వస్తుంటాయని ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది అన్నారు.

ఏప్రిల్ 8వ తేదీన జరిగిన పోలింగ్ తర్వాత కోర్టు ఆదేశాలతో ఓట్ల లెక్కింపు ఆలస్యమైంది. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా ఈ ఎన్నికలు జరగడంతో, వీటిని రద్దు చేసి మళ్లీ నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ ఏపీ హైకోర్టు సింగిల్ బెంచ్ తొలుత తీర్పునిచ్చింది.

ఈ తీర్పుపై ఎస్ఈసీ అప్పీల్ చేయడంతో డివిజన్ బెంచ్ ఈ కేసును విచారించింది. చివరకు సెప్టెంబర్ 16న ఓట్లు లెక్కించి, ఫలితాలు వెల్లడికి హైకోర్టు పచ్చజెండా ఊపింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఏపీ పరిషత్ ఫైట్ 

ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

బాలాపూర్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Live AP MPTC ZPTC Elections Counting Live: పరిషత్‌ పంచాయతీ.. ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ..