Tirupati laddu: కొనసాగుతోన్న పవన్‌ వర్సెస్‌ ప్రకాశ్‌ రాజ్‌ ఇష్యూ.. పవన్‌కు మరోసారి కౌంటర్‌

|

Sep 27, 2024 | 1:12 PM

పవన్‌ చేసిన ట్వీట్‌పై స్పందించిన ప్రకాశ్‌ రాజ్‌.. తిరుపతి లడ్డూ విషయాన్ని దేశ స్థాయిలో ఎందుకు చర్చిస్తున్నారని ప్రశ్నించారు. మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో వ్యవహారం జరిగింది కాబట్టి.. దోషుల్ని శిక్షించాలనిసూచించారు. అయితే దీనిపై పవన్‌ సైతం ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు. రాజ్‌వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు.. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ...

Tirupati laddu: కొనసాగుతోన్న పవన్‌ వర్సెస్‌ ప్రకాశ్‌ రాజ్‌ ఇష్యూ.. పవన్‌కు మరోసారి కౌంటర్‌
Prakash Raj Vs Pawan
Follow us on

తిరుమల లడ్డూ వ్యవహరం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి ఉపయోగించారన్న వార్తలు కోట్లాది మంది మనోభావాలను దెబ్బ తీశాయి. ఇదిలా ఉంటే ఈ వ్యవహారం రాజకీయ పార్టీల మధ్య వివాదానికి తెరతీశాయి. ఓవైపు వైసీపీ, కూటమి ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ అంశంపై డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ తీవ్రంగా స్పందించారు.

శ్రీవారికి జరిగిన అపచరానికి ప్రాయశ్చితం పేరుతో దీక్షను చేపట్టారు పవన్ కళ్యాణ్‌. ఈ క్రమంలోనే దీనిపై కేంద్ర స్థాయిలో విచారణ చేపట్టాలని.. అదే విధంగా సనాతన ధర్మాన్ని కాపాడేందుకు కేంద్రంలో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ ఇటీవల ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ ట్వీట్‌పై నటుడు ప్రకాశ్‌ రాజ్‌ స్పందించారు. దీంతో వీరిద్దరి మధ్య తీవ్ర వివాదం మొదలైంది.

పవన్‌ చేసిన ట్వీట్‌పై స్పందించిన ప్రకాశ్‌ రాజ్‌.. తిరుపతి లడ్డూ విషయాన్ని దేశ స్థాయిలో ఎందుకు చర్చిస్తున్నారని ప్రశ్నించారు. మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో వ్యవహారం జరిగింది కాబట్టి.. దోషుల్ని శిక్షించాలనిసూచించారు. అయితే దీనిపై పవన్‌ సైతం ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు. రాజ్‌వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు.. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ . శ్రీవారి లడ్డూ అపవిత్రంపై తాను మాట్లాడితే ప్రకాశ్ రాజ్‌కు ఏం సంబంధమని పవన్ ప్రశ్నించారు. ప్రకాశ్‌రాజ్ సహచర నటుడే అయినా సనాతన ధర్మంపై జాగ్రత్తగా మాట్లాడని సూచించారు.

ప్రకాశ్ రాజ్ చేసిన ట్వీట్..

అయితే తాజాగా ప్రకాశ్‌ రాజ్‌ మరోసారి ఎక్స్‌ వేదికగా స్పందించారు. పవన్‌ కళ్యాణ్‌పై మరోసారి తనదైన శైలిలో కౌంటర్‌ వేశారు. ఎక్స్‌ లో పోస్ట్‌ చేస్తూ.. ‘మనకేం కావాలి.. ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధిని సాధించడమా. లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవడమా’ అంటూ ప్రకాష్‌రాజ్‌ ప్రశ్నించారు. ట్వీట్‌ చివరిలో జస్ట్‌ ఆస్కింగ్ పేరుతో ప్రకాష్‌ రాజ్‌ ప్రశ్న సంధించారు. దీంతో వీరిద్దరి మధ్య మొదలైన గొడవ మరెన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..