Crime News: జైల్లో ఉన్న భర్తను బెయిల్‌పై బయటకు తెచ్చిమరీ చంపిన భార్య.. అసలు కారణం తెలిస్తే

వైవాహిక సంభంధాలు నానాటికి దిగజారిపోతున్నాయి. నాతిచరామీ అంటూ తాళికట్టిన భర్తను భార్యలే దారుణంగా చంపేస్తున్న ఉదంతాలు ఎక్కువవుతున్నాయి. తాజాగా ప్రకాశంజిల్లాలో ఓ భార్య తన భర్తను తమ్ముడు, మరికొందరితో కలిసి కళ్ళల్లో కారం చల్లి, కత్తులు, కర్రలతో కొట్టి చంపేశారు. అనంతరం గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారంటూ నమ్మించేందుకు ప్రయత్నించారు.

Crime News: జైల్లో ఉన్న భర్తను బెయిల్‌పై బయటకు తెచ్చిమరీ చంపిన భార్య.. అసలు కారణం తెలిస్తే
Wife Kills Husband Prakasam

Edited By:

Updated on: Jan 22, 2026 | 1:57 PM

మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం బద్విడు చెర్లోపల్లె సమీపంలోని అంకాలమ్మ గుడి దగ్గర దారుణ హత్య జరిగింది. దోర్నాలకు చెందిన అడపాల లాల శ్రీను అనే వ్యక్తిని అతని భార్య ఝాన్సీ, ఆమె తమ్ముడు అశోక్‌లు మరికొందరితో కలిసి కత్తులతో పొడిచి, కర్రలతో కొట్టి దారుణంగా హత్య చేశారు. అయితే ఇటీవలే మృతుడు లాలశ్రీను ఓ గంజాయి కేసులో జైలుకు వెళ్లగా.. బుధవారం బెయిల్‌పై విడుదలై బయటకు వచ్చాడు. సరిగ్గా అదే రోజు పథకం వేసి భార్య, ఆమె తమ్ముడు శ్రీనును హత్య చేశారు.

అయితే సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో కీలక విషయాలు తెలుసుకున్నారు. భార్య మరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని.. ఈ విషయం భర్తకు తెలియడంతో గతంలో ఇద్దరికి గొడవలు జరిగాయని తేలింది. దీంతో భర్తను అడ్డు తొలగించుకోవాలనుకున్న ఝాన్సీ.. ప్లాన్ ప్రకారం జైలు నుంచి విడుదలైన శ్రీనును తన తమ్ముడితో కలిసి మందు తాగించి, ఆటోలో తీసుకొస్తూ పెద్దారవీడు మండలం బద్వీడు చెర్లోపల్లి సమీపంలోని అంకాలమ్మ గుడి వద్దకు రాగానే  అతనిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో మరికొంత మంది వ్యక్తులు కూడా పాల్గొన్నారు. వీరంతా కలిసి శ్రీను కళ్లలో కారం కొట్టి, కత్తులతో పొడిచి అతి కిరాతకంగా హత్య చేశారు.

సమాచారం అందుకున్న మార్కాపురం డిఎస్‌పి ఉప్పుటూరి నాగరాజు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. హత్య కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగానే బాధితుడి కుటుంబాన్ని ఆయన విచారించారు.  అయితే ఈ ఘటనపై బాధితుడి కుమార్తె మాట్లుడూ.. బెయిల్‌పై బయటకు వచ్చిన తన తండ్రిని తీసుకొచ్చేందుకు తన తల్లి, మేనమామ, మరికొందరితో కలిసి వెళ్లిందని.. తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగిందని హతుడి కూతురు చెబుతోంది. రాత్రి అవుతున్నా ఇంకా తన తండ్రి ఇంటికి రాకపోవడంతో తన తల్లికి ఫోన్‌ చేస్తే.. ఎవరో నాన్నను హత్య చేసి పారిపోయారని, తన తల్లి ఝాన్సీ చెప్పినట్టు ఆమె పేర్కొంది.

ఇక బాధితుడి తల్లి మాట్లాడుతూ.. సూర్య అనే వ్యక్తితో తన కోడలు ఝాన్సీ వివాహేతర సంబంధం పెట్టుకుందని..  అందుకే తన కొడుకు లాలూ శ్రీనును చంపేసిందని ఆరోపించింది. కానీ తప్పు తనపైకి రాకూడదని.. గుర్తు తెలియని వ్యక్తులు చంపేసినట్టు చిత్రీకరిస్తున్నారని, ఈ దారుణానికి పాల్పడిన వారు తనను, తన మనవళ్ళను కూడా చంపేస్తారన్న భయం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ ఘటనతో తన మనవళ్ళు అనాధలుగా మారారని ఆమె   కన్నీళ్ళపర్యంతమైంది. తమ కుటుంబానికి పోలీసులు న్యాయం చేయాలని హతుడి తల్లి అడపాల సుబ్బమ్మ వేడుకుంటోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.