Prakasam District:: 10 రోజులకే గ్యాస్ సిలిండర్ నిల్.. అయోమయంతో చెక్ చేయగా మైండ్ బ్లాంక్

|

Nov 26, 2021 | 3:17 PM

అతనిది సాధారణ మధ్యతరగతి కుటుంబం. ఈ క్రమంలోనే ఇటీవల వంటింటి అవసరాల కోసం ఓ గ్యాస్ సిలిండర్ బుక్ చేశాడు.

Prakasam District:: 10 రోజులకే గ్యాస్ సిలిండర్ నిల్.. అయోమయంతో చెక్ చేయగా మైండ్ బ్లాంక్
Water Comes From Gas Cylinder
Follow us on

అతనిది సాధారణ మధ్యతరగతి కుటుంబం. ఈ క్రమంలోనే ఇటీవల వంటింటి అవసరాల కోసం ఓ గ్యాస్ సిలిండర్ బుక్ చేశాడు. అయితే అనూహ్యంగా తెచ్చిన 10 రోజులకే గ్యాస్ సిలిండర్ అయిపోయింది. మాములుగా అయితే మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి బండ 4 నుంచి 6 నెలల పాటు వస్తుంది. దీంతో అనుమానం వచ్చి చెక్ చేయగా అసలు విషయం వెలుగుచూసింది.  ప్రకాశం జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చీరాల మండలం రామకృష్ణాపురానికి చెందిన శ్రీనివాసరావు ఇటీవల గ్యాస్ బండ బుక్ చేసుకున్నాడు. వేటపాలెం గ్యాస్ ఏజెన్సీ నుంచి వాహనం ద్వారా సిలిండర్ ఇంటికి డెలివరీ అయ్యింది. నగదు చెల్లించి బండ వంటగదిలో పెట్టి వాడుకోవడం స్టార్ట్ చేశారు. ఊహించని విధంగా  ఆ గ్యాస్ బండ వాడిన పది రోజులకే అయిపోవడంతో అతడికి డౌట్ వచ్చింది. అసలు ఏం జరిగిందో కాసేపు అర్థం కాలేదు. గ్యాస్ లీక్ అయ్యిందేమో అనుకున్నారు. గ్యాస్ లీక్ అయితే వాసన వస్తుంది కదా.. అలాంటిది ఏమీ లేదు.

దీంతో గ్యాస్ సిలిండర్ ఇంత త్వరగా అవ్వడమేంటని కాస్త శ్రద్ధగా పరిశీలించాడు. సిలిండర్‌లో నుంచి నీళ్లు బయటకు వస్తూ కనిపించడంతో వెంటనే కంగుతిన్నాడు. వెంటనే గ్యాస్ ఏజెన్సీని సంప్రదించారు. కొన్ని సిలిండర్లు నీళ్ళతో వస్తున్నాయని.. వేరేది ఇస్తామని గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు చెప్పడంతో అక్కడ కూడా శ్రీనివాసరావు అయోమయంలో పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.

Also Read: ‘ఛత్రపతి’ సూరీడు ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా..? మీరు అస్సలు గుర్తుపట్టలేరు

100 కిలోమీటర్లు ప్రయాణం.. కారులో నుంచి వింత శబ్దాలు.. ఆపి చెక్ చేయగా షాక్