Posani Krishna Murali: ఎట్టకేలకు గుంటూరు జైలు నుంచి పోసాని విడుదల..

గుంటూరు జైలు నుంచి పోసాని కృష్ణమురళి విడుదల అయ్యారు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో గత నెలలో అరెస్టయిన పోసానికి.. హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో జైలు నుంచి రిలీజ్‌ అయ్యారు. అయితే.. జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత పోసాని కృష్ణమురళి భావోద్వేగానికి గురయ్యారు.

Posani Krishna Murali: ఎట్టకేలకు గుంటూరు జైలు నుంచి పోసాని విడుదల..
Posani Krishna Murali

Updated on: Mar 22, 2025 | 5:10 PM

నటుడు పోసాని కృష్ణమురళి బెయిల్‌పై గుంటూరు జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన సమయంలో ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. గత నెల 26న పోసాని కృష్ణ మురళి అరెస్ట్ అయ్యారు. ఆయనకు శుక్రవారమే బెయిల్ లభించింది. అయితే బెయిల్ పత్రాలు సమర్పించడం ఆలస్యం అవ్వడంతో.. శనివారం విడుదలయ్యారు..

ఇక.. ఫిబ్రవరి 26న ఏపీలోని ఓబులవారిపల్లె పోలీసులు.. పోసానిని హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబు, పవన్, లోకేశ్‌లపై అనుచిత వ్యాఖ్యలు, మార్ఫింగ్‌ కేసుకు సంబంధించి అరెస్టు చేసిన పోలీసులు.. రాజంపేట కోర్టులో హాజరు పరిచారు. కోర్టు రిమాండ్‌ విధించడంతో జైలుకు తరలించారు. ఆ తర్వాత.. ఏపీలోని పలు జిల్లాల్లోని పోలీస్ స్టేషన్లలోనూ 16 కేసులు నమోదు కావడంతో PT వారెంట్‌పై ఆయా కోర్టుల్లో హాజరుపరిచారు పోలీసులు. ఈ క్రమంలో.. రాజంపేట, నరసరావుపేట కేసులతోపాటు ఇటీవల నమోదైన కేసుల్లోనూ బెయిల్‌ వచ్చినా.. కొద్దిరోజుల క్రితం CID పోలీసులు కూడా అదుపులోకి తీసుకుని విచారించడంతో పోసాని విడుదలకు బ్రేక్‌ పడింది. అయితే.. శుక్రవారం అన్ని కేసుల్లోనూ పోసాని కృష్ణమురళీకి హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో గుంటూరు జైలు నుంచి రిలీజ్‌ అయ్యారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.