ఏపీలో ‘మాటల’ మంటలు! దాడుల్లో కులాల ప్రస్తావనలు.. ఏది అనుచితం.. ఏది సముచితం!

ఒకే సినిమాను మళ్లీమళ్లీ చూస్తున్నట్టుంది ఏపీలో పరిస్థితి. ఏపీలో బూతుల దాడులు, భౌతిక దాడులు, ఇళ్లపై దాడులు, పార్టీ ఆఫీసులపై దాడులు.. ఇకపై వెరీ కామనేమో అని జనం అనుకునేంతగా తయారవుతోంది పరిస్థితి. దిష్టిబొమ్మలు మాత్రమే తగలబెట్టే సంస్కృతి ఉండేది కాస్తా.. ఇళ్లు, పార్టీ ఆఫీసులను తగలబెట్టుకునేదాకా వెళ్లింది. కొన్ని వ్యాఖ్యలు.. దాని కారణంగా చెలరేగిన మంటలు.. ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి. అసలు.. ఎక్కడ మొదలైందీ రచ్చంతా? తెలుగు ప్రజలంతా కళ్లార్పకుండా చూసేంత స్టోరీ ఈ రెండ్రోజుల్లో ఏం జరిగింది?

ఏపీలో మాటల మంటలు! దాడుల్లో కులాల ప్రస్తావనలు.. ఏది అనుచితం.. ఏది సముచితం!
Andhra Pradesh Politics, Abuse, Vandalism

Updated on: Feb 02, 2026 | 9:47 PM

నెయ్యి.. ఇంత ఆజ్యం పోస్తుందని ఎవరూ ఊహించలేదు. కార్యకర్తలకు ఈ రేంజ్‌లో బీపీ వస్తుందనీ అనుకోలేదు. అసలు ఇంత ఉద్రిక్తతకి కారణం.. మాట పెట్టిన మంట. ఆ మాటను అన్వయించుకోవడంలో వచ్చిన తంటా. అంబటి రాంబాబు అన్నది చంద్రబాబునే, రాజ్యహింసను ప్రోత్సహించేంత ‘అనుచిత వ్యాఖ్యే’ అంటోంది టీడీపీ. నిజమేగా.. అది అనకూడని మాటేగా అని సపోర్ట్ చేస్తున్నాయి జనసేన-బీజేపీ. లేదు లేదు.. అన్నది చంద్రబాబుని కాదు అని స్వయానా అంబటినే క్లారిటీ ఇచ్చారు. ఓవైపు అంబటి వివరణ, ఈ ఘర్షణ జరుగుతుండగానే.. జోగి నుంచి కూడా అలాంటి ‘అనుచిత వ్యాఖ్యే’ వచ్చిందనే రగడ మొదలైంది టీడీపీ నుంచి. అందులో అభ్యంతరకరమైన మాటేముందనే సమర్ధన వైసీపీది. ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఏది అనుచితం, ఏది సముచితం అనే చర్చ జరుగుతోంది. మాటామాటా అనుకున్నంత వరకు ఓకే. అనుచితమా, సముచితమా అనే రగడ వరకూ ఓకే. కాని, ఏకంగా ఇళ్లపై దాడుల వరకూ వెళ్లిందే..! చూస్తున్న వాళ్లంతా ఏంటిదంతా అని అనుకుంటుండగానే.. టాపిక్ ‘సామాజికవర్గాల’ వైపు వెళ్లింది. ఇప్పుడిదే లేటెస్ట్ వర్షన్ కూడా. ఇది ‘కాపు-బీసీ సామాజికవర్గాలపై జరుగుతున్న దాడి’ అని ప్రతిపక్షం అంటుంటే.. మరీ వ్యక్తికి-మొత్తం సామాజికవర్గానికి ముడిపెట్టడమేంటి అంటోంది టీడీపీ. తిరుమల నెయ్యి వివాదంపై ఓ...

Loading...
Unable to load recommendations.
Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి