AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Warning: పదేళ్లుగా ప్రేమించి,పెళ్లి చేసుకున్న జంట.. చావు తప్పదంటూ ప్రముఖ నేత బెదిరింపులు!

ప్రేమించుకుంటే చంపేస్తారా.. కలిసి బ్రతకనివ్వరా అని ప్రశ్నిస్తుంది ఓ ప్రేమజంట. 10ఏళ్లుగా ప్రేమించి.. పెళ్లి చేసుకున్న ఆ జంటకు ప్రముఖ రాజకీయ నేతతో ప్రాణహాని ఉందని లవ్ కపుల్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Warning: పదేళ్లుగా ప్రేమించి,పెళ్లి చేసుకున్న జంట.. చావు తప్పదంటూ ప్రముఖ నేత బెదిరింపులు!
Love
Balaraju Goud
|

Updated on: Jan 09, 2022 | 7:59 PM

Share

Political Leader Warning:  ప్రేమించుకుంటే చంపేస్తారా.. కలిసి బ్రతకనివ్వరా అని ప్రశ్నిస్తుంది ఓ ప్రేమజంట. 10ఏళ్లుగా ప్రేమించి.. పెళ్లి చేసుకున్న ఆ జంటకు ప్రముఖ రాజకీయ నేతతో ప్రాణహాని ఉందని లవ్ కపుల్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటకు చెందిన అపర్ణ, విశాఖకు చెందిన రవికిరణ్‌ కాలేజ్ డేస్ నుంచి పదేళ్లుగా ప్రేమించుకున్నారు. వారి ప్రేమను యువతి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఈనెల 4న తేదీన హైదరాబాద్ లోని ఆర్య సమాజ్ లో రిజిష్టర్ మ్యారేజ్ చేసుకున్నారు సుంకర సత్య అపర్ణ దేవి, పూరి పండా రవి కిరణ్. అయితే, అపర్ణ​కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అపర్ణను సంప్రదించారు. విచారణలో భాగంగా ఒక్కసారి గండేపల్లికి రావాలని యువతిని కోరారు పోలీసులు. దీంతో తల్లిదండ్రుల నుంచి తమకు ఇబ్బందులు ఉన్నాయని.. తమ కుటుంబానికి చెందిన రాజకీయనేత జ్యోతుల నెహ్రూతో ప్రాణహాని ఉందని చెప్పింది అపర్ణ. ఇదే క్రమంలో విశాఖలోని మహిళా చేతన ప్రతినిధులను కలిసి తమ ప్రేమను బ్రతికించాలని వేడుకున్నారు లవ్ కపుల్స్.

తమను ప్రేమ జంట కలిసిన విషయం తెలుసుకున్న జ్యోతుల నెహ్రూ వారిని తూర్పుగోదావరి జిల్లాకు పంపాలని తమపై ఒత్తిడి తెచ్చినట్లు చెప్పారు మహిళా చేతన కన్వీనర్‌. వారి ఒత్తిళ్లకు తలోగ్గేది లేదని.. ప్రేమ జంటకు అండగా ఉంటామని కన్వీనర్‌ కత్తి పద్మ స్పష్టం చేశారు.

తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ప్రేమ పెళ్లి చేసుకున్న యువతి తమ పార్టీకి చెందిన నాయకుడి మేనకోడలు కావడంతో సర్థిచెప్పేందుకు మాత్రమే ఫోన్లో మాట్లాడానని చెప్పారు. భయపెట్టేందుకు కాదన్నారు. జంటను కలపాలని ఆలోచించే వాణ్ణి గానీ విడదీసి వాడ్ని కాదంటూ జ్యోతుల నెహ్రూ క్లారిటీ ఇచ్చారు.

పదేళ్లుగా ప్రేమించుకున్న తాము నూరేళ్లు హ్యాపిగా బ్రతకేందుకు ప్లాన్ చేసుకున్నామని చెబుతున్నారు అపర్ణ, రవికిరణ్. దయచేసి తమకు ఎలాంటి ప్రాణ హాని తలపెట్టవద్దని.. ఒక్కటిగా ఉన్నా మమల్ని రెండుగా విడదీయ వద్దని వేడుకుంటున్నారు ప్రేమ జంట.

Read Also… Covid Vaccine: తెలంగాణలో రేపటి నుంచి ఉచితంగా కొవిడ్ బూస్టర్ డోస్‌ వ్యాక్సిన్‌.. ఎవరెవరు అర్హులంటే..