Bobbili: లాడ్జిలో పోలీసుల తనిఖీలు.. ఇద్దరు అనుమానిత వ్యక్తులను చెక్‌ చేయగా.. కళ్లు జిగేల్!

ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రహస్యంగా రెండు బాక్సుల్లో తీసుకెళ్తున్న బంగారు ఉంగరాలు, నల్లపూసల హారాలు, లాకెట్స్ ఇలా మొత్తం 18 రకాల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారు ఆభరనాల బరువు సుమారు నాలుగు కిలోలు ఉంటుందని పోలీసుల తెలిపారు.

Bobbili: లాడ్జిలో పోలీసుల తనిఖీలు.. ఇద్దరు అనుమానిత వ్యక్తులను చెక్‌ చేయగా.. కళ్లు జిగేల్!
Police Seized Gold

Updated on: Aug 02, 2024 | 9:28 PM

విజయనగరం జిల్లా బొబ్బిలిలో పోలీసులు భారీగా బంగారు నగలు సీజ్‌ చేశారు. ఓ లాడ్జీలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు 4 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఓ లాడ్జిలో తనిఖీలు నిర్వహించగా, ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిపై నిఘా పెంచిన పోలీసులు తనిఖీలు చేయగా పెద్ద మొత్తంలో బంగారు నగలు పట్టుబడ్డాయి. . బంగారు ఆభరణాలకు సంబంధించి ఎలాంటి రసీదులు లేకపోవడంతో, అక్రమంగా తరలిస్తున్నారని, పోలీసులు వాటిని సీజ్ చేశారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రహస్యంగా రెండు బాక్సుల్లో తీసుకెళ్తున్న బంగారు ఉంగరాలు, నల్లపూసల హారాలు, లాకెట్స్ ఇలా మొత్తం 18 రకాల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారు ఆభరనాల బరువు సుమారు నాలుగు కిలోలు ఉంటుందని పోలీసుల తెలిపారు.

Loading...
Unable to load recommendations.
Follow Us