AP News: ఓర్నీ.. దొంగలు ఇలా కూడా ఉంటారా ?
అమాయకులను ఆసరాగా చేసుకొని పలు మోసాలకు పాల్పడుతున్న ఘటనలు ఈ మధ్య కాలంలో పెరిగిపోతున్నాయి. తాజా చిలకలూరిపేటలో పోలీసులకు చిక్కిన ఐదుగురు సభ్యుల ముఠా వినూత్న తరహాలో ప్రయాణీకులను దోచుకుంటుంది.
అమాయకులను ఆసరాగా చేసుకొని పలు మోసాలకు పాల్పడుతున్న ఘటనలు ఈ మధ్య కాలంలో పెరిగిపోతున్నాయి. తాజా చిలకలూరిపేటలో పోలీసులకు చిక్కిన ఐదుగురు సభ్యుల ముఠా వినూత్న తరహాలో ప్రయాణీకులను దోచుకుంటుంది.
చిలకలూరిపేటలో మండిలో ప్రతి శనివారం గొర్రెలు, మేకలు అమ్మకాలు జరుగుతుంటాయి. చుట్టు పక్కల ప్రాంతాల నుండి కాపరులు ఇక్కడకు వచ్చి తమ గొర్రెలు, మేకలను విక్రయించుకొని వెళతారు. అయితే మోసాలకు పాల్పడుతున్న ముఠా వీరినే టార్గెట్ చేసి దోచుకుంటున్నారు. కొద్దీ రోజుల కిందట బాపట్ల జిల్లా మార్టురు మండలం నాగరాజుపల్లికి చెందిన రాంబాబు నాయక్, బాబు నాయక్‌లు తమ పదహారు పొట్టేళ్లను అమ్ముకోగా 1.15 లక్షలు వచ్చాయి. వాటిని తీసుకొని ఇంటికి వెళ్లటానికి ఆటో కోసం ఎదురు చూస్తుండగా నలుగురు ప్రయాణీకులతో కూడిన ఆటో వారి వద్దకు వచ్చింది.
ఆ ఆటలో కొందరు ప్రయాణికులు మూడు బిళ్లల ఆట ఆడాలని, డబ్బులు వస్తాయని ఆశచూపారు. దాదాపు రూ. 17500 నగదును వారు పొగొట్టుకున్నారు. దీంత వారంతా కలిసే మోసం చేస్తున్నారని గ్రహించిన రాంబాబు, బాబు నాయక్ లు వారితో గొడవకు దిగారు. వెంటనే ఆటోలు ఉన్నవారంతా కలిసి వీరిద్దరిని కిందకి నెట్టి వేసి అక్కడ నుండి పరారయ్యారు.
దీంతో రాంబాబు, బాబు నాయక్‌లు చిలకలూరిపేటలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమ వద్ద ఉన్న డబ్బును దోచుకున్నారని ఫిర్యాదు చేయడంతో అప్రమత్తమైన పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. సాతులూరుకి చెందిన ఐదుగురు సభ్యలు ముఠా ఇటువంటి మోసాలకు పాల్పడుతుందని గుర్తించి వారిని అరెస్ట్ చేశారు. అయితే కేవలం 17500 రూపాయల మాత్రమే ఆటలో పొగ్గొట్టుకున్నారని పోలీసుల తేల్చారు. అయితే ఆటోలో ప్రయాణీకుల మాదిరి ప్రయాణిస్తూ మూడు బిల్లల ఆట ఆడుతూ తోటి ప్రయాణీకులను దోచుకుంటున్నారని నర్సరావుపేట డిఎస్పీ నాగేశ్వరావు చెప్పారు.ఇటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానం వచ్చిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.