నిత్య పెళ్లికొడుకు శివశంకర్ (Shivashankar) కేసు విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శివశంకర్ బాధితులు పదకొండు మంది కాదు ఇంకా ఎక్కువే ఉన్నారన్న విషయాలు సంచలనంగా మారుతున్నాయి. నిత్య పెళ్లికొడుకు శివశంకర్ కేసు మలుపులు తిరుగుతోంది. ఇద్దరు మహిళలు ఆరోపణలు చేసిన మరుసటి రోజే, శివశంకర్ రియాక్టవడంతో ఈ కేసు ఇంట్రెస్టింగ్‌గా మారింది. తాను 11మందిని పెళ్లి చేసుకుని మోసం చేసుంటే ఇద్దరే ఎందుకు బయటికి వచ్చారు? మిగతవాళ్లెక్కడ? అంటూ లాజిక్ లాగడంతో, బాధితురాలు మరోసారి ఫైర్ అయ్యారు. బంధువులు, మహిళా సంఘాలతో కలిసి రామచంద్రాపురం (Ramachandrapuram) పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టింది. శివశంకర్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. తాను గుంటూరులోనే ఉన్నానని చెబుతున్నా పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.
శివశంకర్ మోసాలకు సంబంధించి అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. మొత్తం 11 పెళ్లిళ్లు చేసుకున్నాడు. కేసులు కూడా ఉన్నాయి. మిగతావాళ్లు పరువు పోతుందనే బయటికి రావడం లేదు. మాలాగే ఇ మరో అమ్మాయి మోసం పోకూడదనే నేను బయటికు వచ్చాను. పరువును కూడా పక్కనబెట్టి ముందుకొచ్చి న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయిస్తే, ఎందుకు నిందితుడిని అరెస్ట్ చేయలేదు.
– బాధితురాలు
గుంటూరు జిల్లా బేతపూడికి చెందిన శివశంకర్ గుట్టును ఆతని చేతిలో మోసపోయిన మహిళలు రట్టు చేశారు. అతనికి 2018లోనే పెళ్లయిందని, ఈ విషయాన్ని దాచి మ్యాట్రిమోని సైట్లలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పరిచయం చేసుకున్నాడు. విడాకులు తీసుకుని, అందంగా ఉండే యువతులను ఎంచుకుంటాడు. ఇలా కొండాపూర్‌లో తమతోపాటు.. మరో యువతితో కాపురాలు పెట్టినట్లు బాధితులు చెప్పారు. తమ దగ్గర వేర్వేరుగా రూ. 25 లక్షల చొప్పున నగదు, రూ.7 లక్షలు విలువ చేసే బంగారం తీసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు కేసును తేలిగ్గా తీసుకుంటున్నారని చెప్పారు. శివశంకర్ పై కేపీహెచ్‌బీ, రామచంద్రపురం, గచ్చిబౌలి, మాదాపూర్, బాలానగర్, ఎల్బీనగర్, ఏపీలోని గుంటూరు, అనంతపురం, మంగళగిరి పోలీస్‌స్టేషన్‌లలో కేసులు ఉన్నాయి.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి