Tribal Murder Case: వీడిన ముగ్గురు గిరిజన మహిళల హత్య కేసు మిస్టరీ.. హంతకుడు అతడే..!

| Edited By: Balaraju Goud

May 21, 2024 | 11:11 AM

ముగ్గురు గిరిజన మహిళల హత్య కేసు మిస్టరీ వీడుతోంది. సంచలనం కలిగించిన మహిళల హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ ఘటనకు సంబంధించి అనుమానిత ఆటో డ్రైవర్లను అదుపులోకి తీసుకుని విచారణ జరపడంతో అసలు నిజాలు వెలుగు చూశాయి..

Tribal Murder Case: వీడిన ముగ్గురు గిరిజన మహిళల హత్య కేసు మిస్టరీ.. హంతకుడు అతడే..!
Police
Follow us on

ముగ్గురు గిరిజన మహిళల హత్య కేసు మిస్టరీ వీడుతోంది. సంచలనం కలిగించిన మహిళల హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ ఘటనకు సంబంధించి అనుమానిత ఆటో డ్రైవర్లను అదుపులోకి తీసుకుని విచారణ జరపడంతో అసలు నిజాలు వెలుగు చూశాయి..

కర్నూలు శివారులలోని నగరవనం చెరువులో ఇద్దరు మహిళల మృతదేహాలు బయటపడ్డాయి. వీటికి కిలోమీటర్ దూరంలో మరో మహిళ మృతదేహం లభ్యమయింది. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన పోలీసులు విచారణ చేపట్టారు. తెలంగాణలోని వనపర్తికి చెందిన అరుణ, జానకి కర్నూలుకు వృత్తి రీత్యా వచ్చి వెళుతుంటారు. ఈ క్రమంలో కర్నూలు బిల్డింగుల కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ భాషాతో సాన్నిహిత్యం ఏర్పడింది. ఆ తర్వాత అరుణకి భాషకు మధ్య గొడవ జరిగింది. భాషని తనకు తెలిసిన వారితో అరుణ కొట్టించిందని సమాచారం. అది మనసులో పెట్టుకుని భాష అరుణను మట్టుపెట్టాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

ఈక్రమంలోనే మూడు రోజుల క్రితం కర్నూలు కొత్త బస్టాండ్ దగ్గర ఉన్న అరుణ ఆమె సన్నిహితురాలు జానకిని నగరవనం చెరువు దగ్గరికి తీసుకెళ్లాడు బాష. అక్కడే ముగ్గురు కలిసి ఎక్కువ మోతాదులో కల్లు సేవించారు. ఇదే అదునుగా భావించిన బాష అరుణను చెరువు నీటిలోకి తోసేశాడు. ఇది గమనించి కాపాడేందుకు వెళ్లిన జానకిని కూడా నీళ్లలోకి తోసేశాడని పోలీసులు తెలిపారు. ఇద్దరు దరికి చేరలేక మృత్యువాత పడ్డారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టడంతో ఆటో డ్రైవర్ బాష అసలు భాగోతం బయటపడింది.

కాగా, ఈ ఘటన జరిగిన కిలోమీటర్లు దూరంలో మరో మహిళ మృతదేహం కనిపించింది. అయితే ఈ మహిళ ఎవరు అనేది ఇంతవరకు తెలియలేదు. బహుశా అరుణ, జానకిలకు మూడో మహిళ మృతదేహానికి సంబంధం లేదని అది వేరే కేసు అని పోలీసులు అనుమానిస్తున్నారు. బహుశా అనారోగ్యంతో మృతి చెంది ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయిన వెంటనే ఖననం చేశారు. ఆటో డ్రైవర్ భాషని అదుపులోకి తీసుకున్నారు. అరుణకు భాషకి మధ్య మరో వ్యక్తితో పోలీసులు సమాచారం సేకరించడంతో గుట్టు రట్టు అయింది. హత్యకు గురైంది ఇద్దరు మహిళలేనని, మూడో మహిళ కేసు దీనికి సంబంధం లేదని పోలీసులు తేల్చేసే పనిలో ఉన్నారు. మొత్తం మీద సంచలనం కలిగించిన మహిళల హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు చేదించారు

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…