విజయవాడ, ఆగస్టు 04: ముందు కంటెయినర్ లారీ వెనుక పోలీస్ జీప్.. ఇలా కొన్ని కిలోమీటర్లు ఛేజింగ్.. ఇలాంటి సీన్ మన టాలీవుడ్‌లో కంటే హాలీవుడ్ సినిమాల్లోనే మనం ఎక్కువగా చూస్తుంటాం. చివరికి కంటెయినర్ డ్రైవర్ దొరికిపోవడం.. లొంగిపోవడం ఇలాంటి ఘటనలు సినిమాల్లో చూసి ఉంటాం. కానీ అచ్చు ఇలాంటి ఓ ఛేజింగ్ ఘటన ఒకటి మన తెలుగు రాష్ట్రాల్లో జరిగింది. హైవే పై ఒకటి రెండు కిలోమీటర్లు కాదు సుమారు 40 కిలో మీటర్లపాటు ఛేజింగ్ జరిగింది. చివరికి కంటెయినర్ లారీని క్రాస్ చేసి పట్టుకున్నారు. పోలీసులు చేసిన చేజింగ్ చూసిన జనం హడలిపోయారు. ఇదేంటో పెద్ద విషయం అనుకుంటూ సోషల్ మీడియాలో ప్రచారం కూడా మొదలైంది. రోడ్డుపై వెళ్తున్న వాహనదారులను షాక్ కు గురి చేస్తూ మొత్తం మూడు పోలీస్ స్టేషన్స్ నుంచి ఈ కంటైనర్ లారీని పట్టుకోవటానికి విశ్వప్రయత్నాలు చేసారు. అరగంటపాటు విజయవాడ, ఛత్తీస్గఢ్ జాతీయ రహదారిపై పోలీసుల ఛేజింగ్ ఉత్కంఠ రేపింది.
విజయవాడలో ఓ లారీ కంటైనర్ ఆపకుండా వెళ్ళిపోవడంతో ఇబ్రహీంపట్నం పోలీసులకు సమాచారం ఇచ్చారు.. ఇక్కడి పోలీసులు. దాంతో కొండపల్లి డీఏవీ పాఠశాలవద్ద ఆ కంటైనర్ ను ఆపే ప్రయత్నం చేశారు ఇబ్రహీంపట్నం పోలీసులు. కానీ ఇక్కడ కూడా ఆపకుండా పోలీసుల జీబ్‌ను తప్పించుకుని మళ్ళి పారిపోయారు. దాంతో మైలవరం పోలీసులకు సమాచారం ఇచ్చారు ఇబ్రహీంపట్నం పోలీసులు.. ఆ సమాచారం అందుకున్న మైలవరం పోలీసులు రెండు చోట్లో తప్పించుకున్నవారిని ఈసారి ఎలాగైనా పట్టుకోవాలని జి కొండూరు వై జంక్షన్ వద్ద పోలీసులకు చెప్పారు..
ఏకంగా ఓ మినీ ట్రక్‌తో రోడ్డుకు అడ్డంగా పెట్టుకుని కాపుకాశారు.. ఇది చుసిన కాంటేనైర్ డ్రైవర్ మరింత వేగంగా ఆ ట్రక్ ను ఢీ కొట్టి ఇంకా వేగంగా దూసుకుని వెళ్ళిపోయాడు. దాంతో మైలవరం పోలీసులు మైలవరం నుంచి జీ కొండూరు ఎదురుగా వాస్తు కంటైనర్ ను వెబడించటం ప్రారంభించారు. ఆలా జీ కొండూరు మైలవరం మధ్యలో చెవుటూరు వద్ద ఎట్టకేలకు ఒక వైపు పోలీసులు ఇంకో వైపు కాంటేనైర్ ఎదురుబదురు వచ్చాయి.
దాంతో చేసేది లేక కాంటేనైర్ డ్రైవర్ ట్రక్కును ఆపేసి పక్కన ఉన్న ఖాళీ స్థలంలోకి పారిపోయే ప్రయత్నం చేశారు. అందులో ఉన్నవారు.. వారిని వెంబడించి పట్టుకున్న కంటైనర్ ఓపెన్ చేసి చూసిన పోలీసులు కంగు తిన్నారు. అరగంట ఛేజింగ్ చేసి పట్టుకున్న బండిలో ఏదో ఉంటున్నాదనుకుంటే తీరా అందులో ఏమి లేదు.. కానీ ఎందుకు పారిపోయే ప్రయత్నం చేసారో అర్ధంకాక తల పట్టుకున్నారు. ఆపితే ఆపకుండా పారిపోయేందుకు ప్రయత్నించినవారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం