ప్రేమ(Love) అనేది విస్తృతమైనది. దాని అనుభూతి మాటల్లో చెప్పలేనిది. కంటికి కనిపించని ఆ ప్రేమే కొన్ని సార్లు కొందరి జీవితాలను ప్రశ్నార్థకంగా మారుస్తోంది. తెలిసీ తెలియని వయసులో కొందరు ప్రేమలో పడుతున్నారు. తాము చేస్తున్నది సరైనదేననే భ్రమలో ఉంటారు. దీనిని ఆసరాగా చేసుకుంటున్న కొందరు ప్రబుద్ధులు మోసాలకు(Cheating) పాల్పడుతున్నారు. ప్రేమ పేరుతో దగ్గరవుతున్నారు. వారి అవసరాలు తీరాక ముఖం చాటేస్తున్నారు. పెళ్లి చేసుకోవాలని కోరితే నిరాకరిస్తున్నారు. తాజాగా ప్రకాశం(Prakasam district) జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. ప్రేమిస్తున్నానని ఓ ఆటో డ్రైవర్ బాలికకు దగ్గరయ్యాడు. పరిచయం పెంచుకుని శారీరకంగా దగ్గరయ్యాడు. బాలిక గర్భం దాల్చడంతో చేతులెత్తేశాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు గర్భం తొలగించేందుకు ఆస్పత్రికి రాగా అసలు విషయం బయటపడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని నాగెళ్లముడుపు గ్రామానికి చెందిన ఆంజనేయులు ఆటో నడుపుతున్నాడు. తర్లుపాడుకు చెందిన బాలికతో పరిచయం పెంచుకున్నాడు. ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. ఆమెతో శారీరకంగా కలిసి, గర్భవతిని చేశాడు. బాలిక తల్లిదండ్రులు విషయం తెలుసుకునే సరికి ఆమె ఆరో నెల గర్భిణిగా ఉంది. ఈ విషయం బయటకు తెలిస్తే పరువుపోతుందని భావించి… గర్భం తొలగించేందుకు ఒంగోలులోని ఓ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అక్కడి వైద్య సిబ్బంది వీరి వివరాలను ఆరా తీయగా పొంతన లేని సమాధానాలు ఇచ్చారు. వీరి వ్యవహారంపై అనుమానం వ్యక్తం చేసిన ఆస్పత్రి సిబ్బంది.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి నిందితుడి వివరాలు సేకరించారు. అనంతరం ఆంజనేయులును అదుపులోకి తీసుకున్నారు. పిల్లల కదలికలపై తల్లిదండ్రులు దృష్టి సారించాలని పోలీసులు సూచించారు.
Also Read
Srikanth: నా వరకు ఇండస్ట్రీ పెద్ద ఆయనే.. నటుడు శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు..
కొనసాగుతున్న హూండీ లెక్కింపు.. ఇప్పటి వరకు ఆదాయం ఎంతంటే
Reliance: అమెజాన్ చేతికి ఫ్యూచర్ రీటైల్ స్టోర్లు.. మరింతగా దిగజారిన ఆర్థిక పరిస్థితి..!