PM Modi: నేడు సీఎం జగన్‌తో ప్రధాని మోడీ భేటీ.. తొమ్మిది ప్రాజెక్టులకు శ్రీకారం.. రెండో రోజు పీఎం షెడ్యూల్ ఇదే..

శనివారం ప్రధాని నరేంద్ర మోడీ సుమారు రూ. 3,500 కోట్ల విలువైన మూడు ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. దీంతోపాటు సుమారు రూ.7,6000 కోట్ల విలువైన ఐదు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారని అధికారులు తెలిపారు.

PM Modi: నేడు సీఎం జగన్‌తో ప్రధాని మోడీ భేటీ.. తొమ్మిది ప్రాజెక్టులకు శ్రీకారం.. రెండో రోజు పీఎం షెడ్యూల్ ఇదే..
Pm Modi Ys Jagan

Updated on: Nov 12, 2022 | 5:00 AM

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం రాత్రి విశాఖపట్నం చేరుకున్నారు. రోడ్ షో అనంతరం.. జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ నేతలతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. ఈస్ట్రన్ నావల్ కమాండ్ చోళాలో రాత్రి బస చేశారు. శనివారం ఉదయం తొమ్మిదింటి నుంచి పీఎం మోడీ టూర్ షెడ్యూల్ మొదలుకానుంది. ఉదయం తొమ్మిదింటి నుంచి వీఐపీల అపాయింట్మెంట్స్ ఉంటాయి. తర్వాత తొమ్మిదిన్నరకు ప్రధాని మోడీ.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, గవర్నర్ బిశ్వభూశణ్ హరిచంద్రన్‌తో భేటీ అవుతారు. అనంతరం ఆంధ్రా యూనివర్సిటీకి చేరుకుని.. తొమ్మిది ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తారు. అనంతరం జరిగే బహిరంగ సభలో ప్రధానమంత్రి మోడీ ప్రసంగిస్తారు.

శనివారం ప్రధాని నరేంద్ర మోడీ సుమారు రూ. 3,500 కోట్ల విలువైన మూడు ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. దీంతోపాటు సుమారు రూ.7,6000 కోట్ల విలువైన ఆరు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారని అధికారులు తెలిపారు. ప్రధాని బహిరంగ సభకు భారీ జనసమీకరణకు రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రధాని పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ షెడ్యూల్ వివరాలు..

  • ప్రధాని మోడీ ఉదయం 10.10 నిమిషాలకు సీఎం, గవర్నర్లతో కలసి హెలికాఫ్టర్ ద్వారా.. ఏయూకి బయలుదేరుతారు.
  • పది గంటల 25 నిమిషాలకు ఏయూకి చేరుకుంటారు. 10.30 నిమిషాలకు ప్రధాని మోడీ వేదికపైకి చేరుకుంటారు.
  • వర్చువల్‌గా ఐదు ప్రాజెక్టుల శంకుస్థాపన, రెండు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేస్తారు.
  • ఉదయం 10.50 నుంచి పదకొండున్నర గంటల వరకూ ప్రధాని మోడీ ప్రసంగం ఉంటుంది.
  • 11.45కి ప్రధాని మోడీ తిరిగి ఎయిర్ పోర్టుకు బయలుదేరుతారు. మధ్యాహ్నం 12 గంటలకు ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.
  • 12. 05కు ప్రధాని స్పెషల్ ఫ్లైట్ టేకాఫ్‌ తీసుకుంటుంది. మధ్యాహ్నం 1.10 నిమిషాలకల్లా.. హైదరాబాద్- బేగంపేట్ కు చేరుకుంటారు. ఇక్కడితో ఏపీ షెడ్యూల్ ముగిసి తెలంగాణ షెడ్యూల్ మొదలు కానుంది.
  • అనంతరం ప్రధాని మోడీ.. హెలికాఫ్టర్‌లో రామగుండం చేరుకుంటారు. అక్కడ ఎరువుల కార్మాగారం పునురుద్ధణకు ప్రారంభోత్సవం నిర్వహిస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..