PM Modi: తెలుగు ప్రజలకు ప్రధాని మోదీ ఉగాది విషెస్.. ఏమన్నారంటే..?

ఉగాది సందర్భంగా తెలుగు ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తెలుగులో ట్వీట్ చేశారు. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. అటు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి కూడా ఉగాది విషెస్ తెలిపారు. ఏమన్నారో చూద్దాం.

PM Modi: తెలుగు ప్రజలకు ప్రధాని మోదీ ఉగాది విషెస్.. ఏమన్నారంటే..?
Pm Modi Wishes

Edited By:

Updated on: Mar 19, 2026 | 12:33 PM

ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శుభ్రప్రదమైన ఉగాది పండుగ సందర్బంగా ప్రతీఒక్కరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. “సంప్రదాయాలతో ముడిపడి ఉండటంతో పాటు కొత్త శక్తికి, ఆరంభాలకు ఉగాది పండుగ ప్రతీక. నూతన సంవత్సరానికి ఉగాది నాంది పలుకుతుంది. రాబోయే సంవత్సరం ఆనందాలు, విజయాలు, ఆరోగ్యంతో నిండి ఉండాలని ప్రార్థిస్తున్నాను. తమ ఆకాంక్షలను చిత్తశుద్దితో కొనసాగించేలా, సమాజశ్రేయస్సుకు సానుకూలతతో దోహరదపడేలా ఈ ఏడాది ప్రతీఒక్కరినీ ప్రేరేపించాలని కోరుకుంటున్నాను” అంటూ మోదీ పేర్కొన్నారు.

అలాగే రైతుల పాత్రను ప్రస్తావిస్తూ మన కష్టజీవులైన రైతన్నలు కొత్త వ్యవసాయ చక్రానికి ఆశాభావంతో సిద్ధమయ్యే సమయం ఇదేనని చెప్పారు. ఉగాది పచ్చడి ద్వారా జీవితంలోని తీపి, చేదు అనుభవాలను సమానంగా స్వీకరించాలని సూచించే సంప్రదాయం ఈ పండుగ ప్రత్యేకత అని తెలిపారు. జీవితంలోని ప్రతి అనుభవాన్ని అంగీకరించే భావన మనకు ధైర్యాన్ని ఇస్తుంది. సవాళ్లను ఎదుర్కొనే శక్తిని పెంచుతుంది. విజయాన్ని కృతజ్ఞతతో స్వీకరించేలా ప్రేరేపిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆరోగ్యం, ఆనందం నింపాలని, వారు చేపట్టే ప్రతి కార్యంలో విజయాలు సాధించాలని, శాంతి, సానుకూలత విస్తరించాలని ఆయన ఆకాంక్షించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us