Andhra Pradesh: అచ్యుతాపురం దుర్ఘటనపై మోదీ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు..

|

Aug 22, 2024 | 6:54 AM

అనకాపల్లిజిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా కంపెనీలో జరిగిన భారీ అగ్నిప్రమాదం తీవ్ర విషాధాన్ని మిగిల్చింది. రియాక్టర్‌ పేలిన ఘటనలో 18 మంది మృతిచెందగా.. దాదాపు 40 మంది వరకు గాయపడ్డారు. రియాక్టర్ పేలడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. పెద్ద శబ్దాలతో పేలుడు జరగడంతో కొంతమంది బయటకు..

Andhra Pradesh: అచ్యుతాపురం దుర్ఘటనపై మోదీ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు..
Pm Modi
Follow us on

అనకాపల్లిజిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా కంపెనీలో జరిగిన భారీ అగ్నిప్రమాదం తీవ్ర విషాధాన్ని మిగిల్చింది. రియాక్టర్‌ పేలిన ఘటనలో 18 మంది మృతిచెందగా.. దాదాపు 40 మంది వరకు గాయపడ్డారు. రియాక్టర్ పేలడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. పెద్ద శబ్దాలతో పేలుడు జరగడంతో కొంతమంది బయటకు పరుగులు తీశారు. దట్టమైన పొగలతో ఉక్కిరిబిక్కిరి అయి కొందరు…శిథిలాల కిందపడి మరికొందరు ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటనపై ప్రధానిమో నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయినవారి కుటుంబాలకు ప్రధాని సానుభూతి వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి జాతీయ సహాయనిధి నుంచి నష్ట పరిహారం అందించనున్నట్లు మోదీ ప్రకటించారు. ఇందులో భాగంగానే మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం అందించనున్నట్లు మోదీ తెలిపారు. అదే విధంగా గాయపడిన వారి చికిత్స కోసం రూ.50వేలు సాయంగా అందించనున్నట్లు తెలిపారు.

నేడు  సీఎం చంద్రబాబు..

ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు (గురువారం) అచ్చుతాపురానికి వెళ్లనున్నారు. ఉదయం 11.30 గంటలకు విశాఖకు చేరుకోనున్న సీఎం అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకి ఘటనా స్థలానికి వెళ్లనున్న సీఎం.. ప్రమాదం జరిగిన సెజ్‌ను పరిశీలించనున్నారు.

అసలు ప్రమాదం ఎలా జరిగిందంటే..

కాగా ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.. ప్రాణాలు పోతూనే ఉన్నాయి. యజమాన్యాల అంతులేని నిర్లక్ష్యానికి అమాయక కార్మికులు అన్యాయంగా బలవుతూనే ఉన్నారు. తాజాగా అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా కంపెనీలో రియాక్టర్‌ పేలి 18మంది కాలిబూడిదయ్యారు. మరో 40 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో 300మందికి పైగా సిబ్బంది ఉన్నారు. వారిలో ఎవరు గాయపడ్డారు.. ఎవరు చనిపోయారో తెలియక కంపెనీ ఎదుట బాధిత కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లోని ఎసెన్షియా అడ్వాన్సుడ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో వందల సంఖ్యలో కార్మికులు, సిబ్బంది పనిచేస్తున్నారు.

భోజన విరామ సమయం మధ్యాహ్నం ఒంటిగంట ముప్పై నిమిషాల సమయంలో భారీ పేలుడు సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టంగా అలుముకున్న పొగతో అంతా చీకటిగా మారింది. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో కార్మికులు ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు. పేలుడు ధాటికి భారీ శబ్దంతో సమీప గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఫార్మా సెజ్ లోని అగ్నిమాపక యంత్రం సహా చుట్టుపక్కల నుంచి మరో 11 ఫైరింజన్లు మంటలను అదుపు చేశాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..