కొల్లేరులో వలస పక్షుల సందడి.. 98కి చేరిన రామసర్ సైట్స్! ప్రధాని మోదీ ట్వీట్‌ వైరల్

Now 98 Ramsar Wetlands in India: భూగర్భ జలాల పెరుగుదలకు, మత్స్య సంపద వృద్ధికి, వరదల నియంత్రణ తదితర ఎన్నో ప్రయోజనాలు చిత్తడి నెలలు కలిగివున్నాయి. అయితే వేగంగా పెరుగుతున్న నగరీకరణ, వ్యవసాయం, అభివృద్ధి, కాలుష్యం వంటి సమస్యలతో చిత్తడినేలల మనుగడ అత్యంత ప్రమాదకరంగా మారింది..

కొల్లేరులో వలస పక్షుల సందడి.. 98కి చేరిన రామసర్ సైట్స్! ప్రధాని మోదీ ట్వీట్‌ వైరల్
Patna Bird

Edited By:

Updated on: Feb 01, 2026 | 4:41 PM

ఏలూరు, ఫిబ్రవరి 1: వలస పక్షులకు చిత్తడి నేలలు స్వర్గధామాలు. అవి జీవవైవిధ్య కేంద్రాలుగా ఇవి పనిచేస్తుంటాయి. భూగర్భ జలాల పెరుగుదలకు, మత్స్య సంపద వృద్ధికి, వరదల నియంత్రణ తదితర ఎన్నో ప్రయోజనాలు చిత్తడి నెలలు కలిగివున్నాయి. అయితే వేగంగా పెరుగుతున్న నగరీకరణ, వ్యవసాయం, అభివృద్ధి, కాలుష్యం వంటి సమస్యలతో చిత్తడినేలల మనుగడ అత్యంత ప్రమాదకరంగా మారింది. ఈ క్రమంలోనే వీటిని పరిరక్షించటం, కాపాడటం, పునరుద్దరించటం అనే అంశాల్లో భాగముగా చిత్తడినేలల పరిరక్షణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన ప్రాధాన్యతను ఇస్తున్నాయి. రామ్సర్ సైట్ అనేది అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఆర్ద్రభూమి. ఇరాన్‌లోని రామ్సర్ నగరంలో 1971లో జరిగిన ఒప్పందం ఆధారంగా ఈ గుర్తింపు ఇవ్వబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమైన వెట్‌ల్యాండ్స్‌ను పరిరక్షించడమే దీని ప్రధాన లక్ష్యం.

ఏపీలో రామసర్ గుర్తింపు పొందిన అతిపెద్ద లేక్ కొల్లేరు..

కొల్లేరు సరస్సుతో పాటు అస్సాంలోని డిపర్ బీల్ లేక్ లకు భారతదేశంలో తొలిసారిగా 2002 ఆగస్టు 19 న రామసర్ సైట్ హోదా దక్కింది. అప్పటినుంచి ఇప్పటివరకు జనవరి 30 , 2026 వరకు మొత్తం 96 రామసార్ సైట్స్ గా గుర్తించగా దేశవ్యాప్తంగా 13, 61, 332.247 హెక్టార్ల ప్రాంతం ఇందులో ఉంది. ఇక తాజాగా మరోరెండు సరస్సులు ఈ జాబితాలో చేరాయి. ఉత్తరప్రదేశ్ లోని ఏతా జిల్లా పట్నా పక్షుల అభయారణ్యం. గుజరాత్ లోని కచ్ ప్రాంతంలో ఉన్న ఛరీ – దండ్ లు రామసర్ సైట్స్ గా గుర్తింపు లభించింది. దీంతో దేశవ్యాప్తంగా వీటిసంఖ్య 98కు చేరుకుంది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ తన ఎక్స్‌ ఖాతాలో శుభాకంక్షాలు తెలిపారు. చిత్తడి నెలల పరిరక్షణ కోసం అంకితమైన వారిని, స్థానికులను ఆయన ఈ సందర్భంగా అభినందించారు. ఈ గుర్తింపు జీవవైవిధ్య పరిరక్షణకు, కీలక పర్యావరణ వ్యవస్థల రక్షణకు దోహద పడుతుందని ఈ సందర్భంగా తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ చిత్తడి నేలలు వలస, స్థానిక జాతి పక్షుల సురక్షిత నివాసాలుగా నిరంతరం కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి

రేపు ఫిబ్రవరి 2న ప్రపంచ వ్యాప్తంగా చిత్తడి నెలల పరిరక్షణ దినోత్సవం జరుగుతుంది. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో సంచరించే జాతీయ, విదేశీ పక్షుల ప్రాధాన్యత, వాటిని రక్షించుకోవాల్సిన అవసరాన్ని ప్రతియేటా తెలియచేస్తుంటారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.