MLA Jogi Ramesh : ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలను సవాల్ చేస్తూ పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ శుక్రవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ఇతర పార్టీల తరఫున పోటీ చేసేవారికి సంక్షేమ పథకాలు కట్ చేస్తామని ఎమ్మెల్యే జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఈ వ్యాఖ్యలపై ఎస్ఈసీ స్పందించింది.
దీంతో.. ఈ నెల 13 తేదీ వరకు మీడియాతో మాట్లాడొద్దని ఎస్ఈసీ ఆంక్షలు విధించింది. అంతేకాదు సంమావేశాల్లో కూడా ప్రసంగించొద్దని కూడా తేల్చిచెప్పింది. ఈ మేరకు ఈ నెల11వ తేది సాయంత్రం ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.
ఈ ఆదేశాలపై ఏపీ హైకోర్టులో జోగి రమేష్ శుక్రవారం నాడు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఎస్ఈసీ ఆదేశాలను సస్పెండ్ చేయాలని ఆ పిటిషన్ లో ఎమ్మెల్యే కోరారు. ఈ పిటిషన్ పై ఏపీ హైకోర్టు ఇవాళ విచారణకు స్వీకరించింది. ఇవాళ ఈ పిటిషన్ పై విచారణ సాగనుంది.
West Bengal Bandh : రసవత్తరంగా మారిన బెంగాల్ రాజకీయాలు.. ఉదయం నుంచే నిరసన సెగలు..