Janasena: ఆ నియోజకవర్గం నుంచే పవన్ కళ్యాణ్ పోటీ.. ప్రకటించిన జనసేనాని..

|

Mar 14, 2024 | 3:25 PM

ఆంధ్రప్రదేశ్‎లో రాజకీయాలు రోజు రోజుకూ కాదు గంటగంటకు ఉత్కంఠగా సాగుతున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసే అసెంబ్లీ నియోజకవర్గాన్ని ప్రకటించారు. పిఠాపురం నుంచి అసెంబ్లీ బరిలో దిగనున్నట్లు వెల్లడించారు. గతంలో జరిగిన 2019 శాసనసభ ఎన్నికల్లో గాజువాక, భీమవరం రెండు చోట్ల నుంచి పోటీ చేసిన పవన్ ఈసారి పిఠాపురం నుంచి పోటీ చేసేందుకు సిద్దమయ్యారు. ఈ విషయాన్ని తానే స్వయంగా ప్రకటించారు. గత ఎన్నికల్లో పవన్ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కేవలం ఒక అసెంబ్లీ సీటు మాత్రమే గెలుచుకుంది జనసేన.

Janasena: ఆ నియోజకవర్గం నుంచే పవన్ కళ్యాణ్ పోటీ.. ప్రకటించిన జనసేనాని..
Pawan Kalyan
Follow us on

ఆంధ్రప్రదేశ్‎లో రాజకీయాలు రోజు రోజుకూ కాదు గంటగంటకు ఉత్కంఠగా సాగుతున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసే అసెంబ్లీ నియోజకవర్గాన్ని ప్రకటించారు. పిఠాపురం నుంచి అసెంబ్లీ బరిలో దిగనున్నట్లు వెల్లడించారు. గతంలో జరిగిన 2019 శాసనసభ ఎన్నికల్లో గాజువాక, భీమవరం రెండు చోట్ల నుంచి పోటీ చేసిన పవన్ ఈసారి పిఠాపురం నుంచి పోటీ చేసేందుకు సిద్దమయ్యారు. ఈ విషయాన్ని తానే స్వయంగా ప్రకటించారు. గత ఎన్నికల్లో పవన్ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కేవలం ఒక అసెంబ్లీ సీటు మాత్రమే గెలుచుకుంది జనసేన. గత కొంత కాలంగా ఎంపీగా పోటీ చేస్తారని వస్తున్న వార్తల నేపథ్యంలో దీనిపై స్పష్టత ఇచ్చారు జనసేనాని. అయితే చాలా మంది ఎంపీగా కూడా పోటీ చేయాలని కోరుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం తనకు ఎంపీగా పోటీ చేసే అలోచన లేదని చెప్పేశారు పవన్ కళ్యాణ్. అయినప్పటికీ కొంత మంది పెద్దలతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటాన్నారు.

మంగళగిరి పార్టీ ఆఫీసులో కార్యకర్తల సమావేశం నిర్వహించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ పొత్తు కోసం కొన్ని సీట్లు త్యాగం చేసినట్లు ప్రకటించారు. అందులో భాగంగానే పార్టీ కోసం కష్టపడుతున్న వారికి సీట్లు ఇవ్వలేక పోయానన్నారు. పెద్దమనసుతో వెళ్తే చిన్నవాళ్లమయ్యాం అని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యవర్తిత్వం వహిస్తే ఏం నష్టపోతామో అర్థమైందన్నారు. ఇదిలా ఉంటే మార్చి 14న టీడీపీ రెండవ అభ్యర్థుల జాబితాను మధ్యాహ్నం 1 గంటకు విడుదల చేసింది. ఇందులో మోత్తం 34 మంది అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల వివరాలను వెల్లడించింది. టీడీపీ అధినేత చంద్రబాబు రెండవ జాబితా విడుదల చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే పవన్ కళ్యాణ్ తన అసెంబ్లీ నియోజకవర్గాన్ని ప్రకటించడంపట్ల రాజకీయంగా ఆసక్తి నెలకొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..