గుంటూరు జిల్లా జైలు నుంచి పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి విడుదల.. కోర్టు విధించిన కండీషన్స్ ఇవే..

తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తికి ఎట్టకేలకు ఊరట లభించింది. ఆయనకు గుంటూరు జిల్లా రెండో అదనపు న్యాయస్థానం  షరతులతో కూడిన బుధవారం బెయిల్ మంజూరు చేసింది.

గుంటూరు జిల్లా జైలు నుంచి పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి విడుదల.. కోర్టు విధించిన కండీషన్స్ ఇవే..

Updated on: Feb 11, 2021 | 8:50 PM

తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తికి ఎట్టకేలకు ఊరట లభించింది. ఆయనకు గుంటూరు జిల్లా రెండో అదనపు న్యాయస్థానం  షరతులతో కూడిన బుధవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో గురువారం జిల్లా జైలు నుంచి ప్రవీణ్ చక్రవర్తి విడుదలయ్యారు.

షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసిన న్యాయస్థానం.. ప్రవీణ్ ప్రతి ఆదివారం సీఐడీ కార్యాలయంలో సంతకం పెట్టాలని, దేశం విడిచివెళ్లరాదని, పాస్‌పోర్టును న్యాయస్థానానికి అప్పగించాలని సూచించింది. మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రవీణ్ చక్రవర్తి గతంలో చేసిన ప్రసంగం వీడియో.. సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో ఇటీవల మంగళగిరి సైబర్‌ సీఐడీ పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో  హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్న సమయంలో ఈ పాస్టర్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది.
Also Read: