Paritala Ravindra Annaprasana Ceremony: టీడీపీ నేత పరిటాల శ్రీరామ్, జ్ఞాన దంపతులు కుమారుడు అన్నప్రాసన ఘనంగా జరిగింది. అయితే, అ కార్యక్రమంలో వారి సుపుత్రడు పరిటాల రవీంద్ర పట్టుకున్న వస్తువు ఇప్పుడు తెలుగునాట హాట్‌టాఫిక్‌గా మారింది. ప్రస్తుతం ఈ ఫోటో ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది.
2017 అక్టోబర్ 1న పరిటాల శ్రీరామ్, జ్ఞాన దంపతులకు వివాహం జరిగింది. వారికి ఓ బాబు పుట్టాడు. తమ కుమారుడికి పరిటాల రవీంద్ర అని పేరు పెట్టారు. శ్రీరామ్ తన తండ్రి అయిన పరిటాల రవీంద్ర పేరునే కొడుక్కి పెట్టుకున్నారు.
ఇదిలావుంటే, అన్నప్రాసన అంటే పుట్టిన శిశువుకు మొట్టమొదటిసారి అన్నం ముట్టించడం. ఇది హిందు సాంప్రదాయంలో కనిపించే ఒక పెద్ద పండుగ. ఇదే క్రమంలో శిశువుకు ఆయువు, ఆరోగ్యం, తేజస్సు వృద్ధి చెందుతాయని నమ్మకం. ఇదే క్రమంలో పరిటాల దంపతులు వారి కొడుకు రవీంద్ర అన్నప్రాసన చేయించారు. ఈ సందర్బంగా డబ్బులు, పుస్తకాలు, కత్తి, అహారం ఇలా వివిధ రకాల వస్తువులను ముందుంచి ముట్టుకోమన్నారు. అయితే ఏకంగా బాబు రవీంద్ర కత్తి పట్టుకుని అందర్నీ అశ్చర్యానికి గురిచేశాడు. కొడుకు చేసిన పనికి తండ్రి పరిటాల శ్రీరామ్‌తో సహా పలువురు కుటుంబ సభ్యులు అశ్చర్యం వ్యక్తం చేశారు. ఇందుకు సంబందించి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Read Also… రైల్వే శాఖ నాకు ప్రకటించిన రూ. 50 వేల రివార్డు సొమ్మును ఆ బాలుడి కుటుంబానికే ఇస్తా..మయూర్ షేక్