AP News: ఇక్కడ తెల్లార్లు దసరా ఉత్సవాలే..అక్కడ ఏముంది? తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!

| Edited By: Velpula Bharath Rao

Oct 12, 2024 | 10:21 PM

దసరా నవరాత్రి ఉత్సవాలు అమ్మవారి దేవాలయాలలో అన్నిచోట్ల అంగరంగ వైభవంగా చేస్తారు. కడప జిల్లాలోని ప్రొద్దుటూరు నియోజకవర్గం ప్రొద్దుటూరులో ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.

AP News: ఇక్కడ తెల్లార్లు దసరా ఉత్సవాలే..అక్కడ ఏముంది? తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!
Proddutur Dasara Celebrations
Follow us on

దసరా నవరాత్రి ఉత్సవాలు అమ్మవారి దేవాలయాలలో అన్నిచోట్ల అంగరంగ వైభవంగా చేస్తారు. కడప జిల్లాలోని ప్రొద్దుటూరు నియోజకవర్గం ప్రొద్దుటూరులో ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఇక్కడ రెండవ మైసూర్ ఉత్సవాలుగా పిలవబడే ఈ ఉత్సవాలు దసరా రోజు సాయంత్రం మూడున్నర గంటలకు జమ్మి ఉత్సవాలతో ప్రారంభమవుతాయి. ఈ ప్రారంభ ఉత్సవాలను ఇక్కడ దళితులతో పూజలు చేయించి ప్రారంభిస్తారు. అనంతరం తెల్లవారుజాము వరకు ఈ ఊరేగింపు ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి

కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయం 134 ఏళ్ల చరిత్ర కలిగిన దేవాలయం.. ప్రొద్దుటూరు పట్టణానికి పక్కనే ఉన్న కొర్రపాడు గ్రామంలోని శ్రీ కామిశెట్టి చిన కొండయ్య అనే వ్యక్తికి కన్యకా పరమేశ్వరి అమ్మవారు కలలో కనిపించి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయాన్ని ప్రొద్దుటూరులో ఏర్పాటు చేయాలని ఆయనకు చెప్పినట్లు స్థానిక ప్రజలు చెప్పుకుంటారు. ప్రతి ఏటా దళితుల దగ్గర నుంచి జమ్మి ఉత్సవాన్ని ప్రారంభించి దసరా ఉత్సవాలు ముగిస్తారు. ఇది ఇప్పటినుంచి కాదు శతాబ్దం నాటి చరిత్ర..

దసరా ఉత్సవాల వీడియో ఇదిగో:

దాదాపు 100 సంవత్సరాలు పైబడి అంటే ఆలయ నిర్మాణం జరిగిన మూడు దశాబ్దాల తర్వాత ఈ సంఘటన జరిగిందని ఆ తరువాత నుంచి అమ్మవారి జమ్మి ఉత్సవాలు మొదటిగా దళితుల పూజతోనే ప్రారంభమై శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అంగరంగ వైభవంగా బాణా సంచాల మధ్య కోలాటాలు డప్పు వాయిద్యాల మధ్య ఈ ఉత్సవం జరుగుతుంది. ఆర్యవైశ్యులు ఆధ్వర్యంలో శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహించబడి దసరా రోజు జమ్మి పూజ దళితులతో ప్రారంభమై మరుసటి రోజు తెల్లవారుజాము వరకు కూడా ఉత్సవ విగ్రహాలు ఊరేగింపుగా పొద్దుటూరు పురవీధులలో ఊరేగుతూనే ఉంటాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి