AP News: వామ్మో.. వాయ్యో.. బైకులు, ఆటోలే కొట్టుకుపోతున్నాయి..ఎక్కడో తెలుసా?

అనంతపురం శివారులో పండమేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో పలు కాలనీలు వస్తున్న వరదకు బైకులు, ఆటోలు కొట్టుకుపోయాయి. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

AP News: వామ్మో.. వాయ్యో.. బైకులు, ఆటోలే కొట్టుకుపోతున్నాయి..ఎక్కడో తెలుసా?
Pandameru River Is Flowing Rapidly

Edited By: Velpula Bharath Rao

Updated on: Oct 22, 2024 | 9:34 AM

అనంతపురం నగరంలో రాత్రి ఉరుములు, మెరుపులతో ఎడతెరిపిలేని వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రధానంగా అనంతపురం శివారులో పండమేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. పండమేరు వాగుకు ఆనుకుని ఉన్న పలు కాలనీలోకి వరద నీరు ప్రవహించింది. ఒక్కసారిగా వరద నీరు కాలనీలోకి చేరడంతో… స్థానికులు ఇల్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వచ్చారు.

వరద నీటిలో ఇళ్ళు మునగగా.. ఆటోలు, బైకులు వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి. కనగానపల్లి చెరువు కట్ట తెగడంతో పండమేరు వాగుకు వరద ఉధృతి వచ్చింది. అటు పెనుకొండలో రాత్రి కురిసిన భారీ వర్షానికి గుట్టూరు, వెంకటగిరి పాలెం చెరువులు పొంగి, పొర్లుతున్నాయి. భారీ వర్షంతో ఒక్కసారిగా హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై వరద నీరు రావడంతో.. వరద నీటిలోనే బస్సులు, లారీలు, కార్లు నిలిచిపోయాయి. హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వరద నీటిలో చిక్కుకున్న బస్సులను పోలీసులు జేసీబీల సాయంతో బయటకు తీసి.. హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారిపై పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.

వీడియో ఇదిగో:

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..